గత కొన్ని సంవత్సరాల నుండి అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయంపై తెలుగు రాష్ట్రాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పెంపు విషయంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని పోరాటం జరిగింది. స్వయంగా ప్రధాన మోడీ ని కలిసి చెప్పుకున్నా గానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలకు తొలగిస్తూ ఇతర రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా అకస్మాత్తుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఆ నిర్ణయం ప్రకటించడం వెనుక జగన్ కెసిఆర్ మీద కేంద్రం త్రివేణి ఏమైనా తీర్చుకునే పరిస్థితి ఏర్పడిందా అన్న సందేహం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.

 

తాజాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నాలుగు ఈశాన్య రాష్టాలు నాగాలాండ్, మణిపూర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు కొత్తగా విభజించిన జమ్ము కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు ప్రక్రియ స్టార్ట్ చేసింది. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ ఇటీవల జారీ చేయడం జరిగింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులవల్ల నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినట్లు ఆ నోటిఫికేషన్లో కేంద్రం తెలిపింది. 370 చట్టం రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ విభజన జరగడంతో ఆ రెండు ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల్లో ఎన్సార్సీతో తీవ్ర ప్రభావం ఏర్పడింది.

 

దీంతో ఆందోళనలతో ఆ రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే మరోపక్క మాత్రం ఇది తెలుగు రాష్ట్రాల మీద రివేంజ్ తీర్చుకోవటం కోసం మరియు అదే విధంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలపడకుండా ఒక ఉద్దేశపూర్వకంగా ఉత్తర భారతదేశంలో ఉన్న ఆ నాలుగు రాష్ట్రాలకు మాత్రమే పునర్విభజన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: