ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత... టిడిపి పరిస్థితి రోజు రోజుకు ప్రశ్నార్థకం గా మారిపోతున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ నుంచి ఎంతో మంది నేతలు విడిపోతుండటంతో  చంద్రబాబుకు భారీ షాక్ లు తగులుతు ఉన్నాయి. పార్టీ నేతలంతా ఒకే ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ప్రస్తుతం ప్రజా చైతన్య యాత్ర పేరుతో జిల్లాలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ ను  ఒక తాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. స్థానిక నేతలతో చర్చించి నియోజకవర్గ ఇన్చార్జి లను నియమించే  పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిల ఖాళీలను భర్తీ చేసిన చంద్రబాబు... ఆ రెండు నియోజకవర్గాల విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు తెలుస్తోంది. 

 

 

 గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపి కి జై కొట్టిన తర్వాత బాబు పరిస్థితి అయోమయంలో పడిపోయింది. టిడిపికి కీలకమైన నియోజకవర్గం కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు చంద్రబాబు ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో ఇంచార్జ్ ను నియమించడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జిగా రోజుకొక పేరు తెర మీదికి వస్తుండడంతో కన్ఫ్యూజన్ లో ఉన్నారట చంద్రబాబు నాయుడు. ఈ నియోజకవర్గ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అనే దానిపై స్థానిక నేతలతో చర్చలు జరుపూతూ  అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారట టీడీపీ అధినేత. అయితే గన్నవరం నియోజకవర్గం లో ఒకటి బిసి మరొకటి ఓసి అనే రెండు ఆప్షన్లు ఉన్నాయని వీరిలో ఎవరికో ఒకరికి నియోజకవర్గ ఇన్చార్జి పదవి కట్టబెట్టాలని పార్టీ నేతలు సూచిస్తున్నారట. 

 

 

 అయితే గన్నవరం నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా ఇక్కడ ఇన్చార్జి నియమించటం  చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారినట్లు. మరొకటి సత్తెనపల్లి నియోజకవర్గంలోను  ఇలాంటి సస్పెన్సే కొనసాగుతుందని టీడీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మాజీ స్పీకర్ కోడెల మరణంతో ఇక్కడి టీడీపీ ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలని దానిపై చంద్రబాబు అయోమయంలో పడ్డారు. అయితే ఇన్చార్జి పదవి కోసం కోడెల కుమారుడు శివరాం..  మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగాబాబులు ఆశావాహులుగా  ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరిలో ఎవరి  పై మొగ్గు చూపిన రెండవ నేత కాస్త నిరాశకు లోనై అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధకు సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తానని ప్రచారం కూడా జరుగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గం లో గందరగోళం నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: