ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత... ఇప్పటివరకు నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. అయితే రెండు రాష్ట్రాల్లో ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రాన్ని చాలాసార్లు కోరారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా ల తో భేటీ అయినప్పటికీ ఇప్పటివరకు దీనిపై కేంద్రం మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భారీ షాక్ ఇస్తూ తాజాగా... ఇతర రాష్ట్రాల్లో  నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ఒక కమిషన్  కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

 

 

 

 ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్,  మణిపూర్,అసొం,  అరుణాచల్ ప్రదేశ్  తోపాటు కొత్తగా విభజించిన జమ్మూకాశ్మీర్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన జరపాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం ఒక కమీషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నాము ఏమి  కేంద్రం ప్రకటన పై వివరణ  ఇచ్చింది. అయితే నియోజకవర్గాల పునర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లిస్టులోని రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం ఈ ప్రకటన ద్వారా భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో  నియోజకవర్గ పునర్ విభజన చేపట్టాలని ఎన్నో రోజులనుండి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వినతిని  పట్టించుకోలేదని తెలుస్తోంది. 

 

 

 

 ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎన్ని భేటీలు  ప్రయోజనం లేకుండా పోయింది. అయితే పలు రాజకీయ ప్రయోజనాలు ఆశించే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నియోజకవర్గాల పునర్విభజన కోరుతున్నారని భావించే... తెలుగు రాష్ట్రాల్లో  నియోజకవర్గాల పునర్ విభజన పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  మండలి రద్దు ద్వారా పదవి కోల్పోయిన వారికే కాకుండా ఇంకొంతమందికి..నియోజకవర్గం పునర్ విభజన జరిగితే పదవులు కేటాయించవచ్చు అని భావించారు. తెలంగాణలో కూడా కేసిఆర్ ఇలాంటి ప్రయోజనాల దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన కోరినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో... ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: