మనిషి పుట్టుకకు మూలాధారం మహిళ. కానీ ఆ మహిళకే రక్షణ కరువైంది. జన్మనిచ్చిన తల్లి లాంటి మరో మహిళ పై  కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎంతో మంది మహిళల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. పండు ముసలమ్మల  నుంచి పసిపిల్లల వరకు కామందుల కోరల్లో చిక్కుకొని బలైపోతున్నారు. కామాంధులను  శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ మార్పు మాత్రం కనిపించడం లేదు. కామందులను ఏకంగా ఎన్కౌంటర్ చేసి చంపిన ఎవరిలో భయం మాత్రం కనిపించడం లేదు. దీంతో చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కనీసం రక్షణ లేకుండా ప్రశ్నార్ధక  జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీద రాగా..  తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. 

 

 

 కామం తో ఊగిపోయిన 58 ఏళ్ల వృద్ధుడు...నాలుగేళ్ళ చిన్నారిపై కన్నేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ అమానుష ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఊరిలో చుట్టూ పంట పొలాలతో అంతగా పచ్చగా కనిపిస్తుంది. అక్కడే గ్రామంలోని ఓ కాలనీలో ఇద్దరి దంపతులకు అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ నాలుగేళ్ల పాప ఉంది . అయితే ఆ నాలుగేళ్ల పాప పై 58 ఏళ్ల వృద్ధుడు కన్నేసాడు . గోరుముద్దలు తిని ఆ చిన్నారిపై కామ వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఇంటి పరిసరాల్లో అంతా గమనించాడు. తల్లి ఇంట్లో వంట చేస్తుండగా తండ్రి కాస్త దూరంలో ఏదో పనిలో నిమగ్నమయ్యాడు ఆ చిన్నారి బయట ఆడుకుంటుంది ఇదే అదునుగా భావించిన ఆ నీచుడు పక్కనే ఉన్న జొన్న చేనులోంచి రెండు కంకులు  కావాలా అంటూ ఆ చిన్నారిని జొన్న చేనులోకి  పిలిచాడు. 

 

 

 తాత వయసున్న వృద్ధుడు పిలవడంతో చిన్నారి కంకులు తీసుకోవడానికి వెళ్ళింది. ఇంతలో పాపను జొన్న చేను మధ్యలోకి ఎత్తుకెళ్లి పోతున్న సమయంలో... ఆ పాపను పిలుస్తూ తల్లి ఇంట్లోంచి బయటకు వచ్చింది... ఇక ఇంతలో ఆ వృద్ధుడు తమ చిన్నారి కూతురుని ఎత్తుకెళ్తుండటం  చూసి అతని వెంటనే పరిగెత్తింది తల్లి... ఇక భార్య వెంట సదరు భర్త కూడా పరిగెత్తాడు. ఇక భార్య వెళ్లి చూసేసరికి ఆ చిన్నారిని పడుకోబెట్టి అత్యాచారం చేయబోతున్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న తల్లి అతన్ని నివారించేందుకు ప్రయత్నించగా ఆ తల్లిని తోసేశాడు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న భర్త  జొన్న కంకుల తో ఆ వృద్ధుని రెండు మూడు వాయించే సరికి పారిపోదాం అనుకున్నాడు అయినప్పటికీ వదలని తండ్రి... చితకబాది చేను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు

మరింత సమాచారం తెలుసుకోండి: