2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ సీట్లలో 8 వైసీపీ గెలిస్తే, 4 టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ నుంచి గెలిచిన 8 మందిలో ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాసరెడ్డిలు మంత్రులు అయ్యారు. ఇద్దరు మంత్రులని పక్కనబెడితే వైసీపీకి 6 గురు, టీడీపీకి 4గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఇక ఈ 10 మందిలో ఈ 10 నెలల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావునే.

 

ప్రకాశం ఎమ్మెల్యేల్లో రాష్ట్ర వ్యాప్తంగా బాగా తెలిసిన వ్యక్తి కూడా ఏలూరినే. ఒకే ఒక దెబ్బతో ఏలూరి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏలూరి, గత ఐదేళ్లు నియోజకవర్గానికి అనేక సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలా చేయడం వల్లే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఫ్యాన్ గాలి ఉన్న, అపోజిట్‌లో దగ్గుబాటి లాంటి దిగ్గజం ఉన్న ఓడించి మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న ఏలూరి తన నియోజకవర్గ ప్రజలకు సేవలు చేయడం ఆపలేదు.

 

ఓ వైపు అధినేత చంద్రబాబు ఆదేశాలు పాటిస్తూ, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే, మరోవైపు నిధులు అందకపోయిన సొంత డబ్బులతో సాధ్యమైన వరకు పనులు చేసేసుకుంటున్నారు. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు అండగా ఉంటున్నారు. అలాగే హార్టికల్చర్‌లో ఎమ్మెస్సీ చేసిన ఏలూరి, తన నియోజకవర్గంలోని రైతులకు సాయం చేస్తున్నారు. అయితే ఇన్ని రకాలుగా ప్రజలకు సేవలు చేస్తున్న ఏలూరి ఇటీవల జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డు తీసుకున్నారు.

 

రాష్ట్రంలోనే కాకుండా, దక్షిణ భారతదేశంలోనే ఈ అవార్డు తీసుకున్న ఏకైక ఎమ్మెల్యే ఏలూరినే కావడం విశేషం. ఇలా అవార్డు తీసుకున్న తర్వాత ఏలూరి క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్ళిన ఈయనని గుర్తుపట్టని వారు ఉండటం లేదు. అటు తెలంగాణలో కూడా ఈయన్ని పలు కార్యక్రమాలకు అతిథిగా పిలుస్తున్నారంటే ఏలూరి క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు  పైగా ఇటీవల పర్చూరులో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ఓ రేంజ్‌లో సక్సెస్ కావడం వెనుక ఏలూరి క్రేజ్ కూడా ఒక కారణమే. మొత్తానికైతే ఏలూరి క్రేజ్ మామూలుగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: