బిల్ క్లింటన్.. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఈయన భార్య పేరు హిల్లరీ క్లింటన్. అయితే తాజాగా మోనికా లెవిన్‌స్కీతో ఆయ‌న‌కు ఉన్న ఎఫైర్ గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించాడు బిల్‌క్లింట‌న్‌. అప్పట్లో చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని, దీంతో దాని నుంచి ఉపశమనం పొందడానికి మోనిక లెవిన్స్కీతో సంబంధం పెట్టుకున్నానని బిల్ క్లింటన్ ఫ‌స్ట్ టైమ్ ఒప్పుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా బిల్ క్లింటన్ ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌లపై ‘హిల్లరీ’ అనే పేరుతో రూపొందించిన నాలుగు గంటల డాక్యుమెంటరీ ప్ర‌స్తుతం సంచ‌ల‌నం క్రీయేట్ చేస్తోంది.

 

ఈ  డాక్యు మెంటరీలో హిల్లరీ క్లింటన్, ఆమె భర్త బిల్ క్లింటన్ వేర్వేరుగా పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మోనికాతో ఉన్న రిలేషన్‌షిప్‌‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిల్ క్లింటన్. తాను అసంతృప్తికి, భయాందోళనలకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ అధిగమించి, ప్రశాంతత, ఉపశమనం పొందేందుకే ఇటువంటి పని చేశానని బిల్‌క్లింట‌న్ తెలిపారు. 

 

మ‌రియు ఆమెతో ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని  బిల్ క్లింటన్ వెల్లడించారు. అయితే, కొన్ని విషయాలు మనుషులని జీవితాంతం వెంటాడుతుంటాయని, మనిషి చేయకూడని పనులు చేస్తుంటాడని చెప్పారు. మోనికాతో సంబంధం తన జీవితంలోనూ ఎన్నో మలుపులకు దారితీసిందని చెప్పారు. రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. అలాగే తాను ఆనాడు చేసింది తప్పేనని అంగీకరించారు. 

 

కాగా, రెండుసార్లు 1993 నుంచి 2001 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన క్లింటన్‌.. మోనికాతో వైట్‌హౌస్‌లో జరిపిన రాసలీలలు 1998లో న్యూస్ వీక్ కథనంతో వెలుగులోకి వచ్చింది. నాటి ఈ సంఘటన క్లింటన్‌ను ఇప్పటికీ వెంటాడుతోంది. మ‌రోవిష‌యంలో ఏంటేంటే.. గతంలో ఆయన అనేక సార్లు మోనికాతో తన ఎఫైర్‌ వార్తలను ఖండించారు. కానీ, తాజాగా అది నిజమేనని బిల్‌ క్లింటన్‌ ప్రకటించడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి: