నిండైన కుంకుమ బొట్టుతో సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే రూపం ఆమెది. పదునైన విమర్శలతో రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే గళం ఆమెది. ఆపన్నులు ఏ సమయంలో సహాయం కోరినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే అభయహస్తం ఆమెది.. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లికించింది సుష్మా స్వరాజ్‌. 

 

IHG

 

సుష్మ స్వస్థలం ప్రస్తుత హరియాణాలోని అంబాలా. హరిదేవ్‌ శర్మ, లక్ష్మీదేవి దంపతులకు ఆమె 1952 ఫిబ్రవరి 14న జన్మించారు. హరిదేవ్‌ ఆరెస్సెస్‌లో చాలా కీలకంగా పనిచేసేవారు. సుష్మ చదువుల్లో చురుకు. అంబాలాలోని ఎస్‌.డి.కళాశాలలో బీఏ చదువుతున్నప్పుడు వరుసగా మూడేళ్లపాటు ఎన్‌సీసీలో ఉత్తమ క్యాడెట్‌ గా ఎంపికయ్యారు. ఆ కళాశాలలో ఉత్తమ విద్యార్థి పురస్కారాన్నీ పొందారు. 1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ ను వివాహంచేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. 

 

IHG

 

సుష్మ విద్యార్థిగా ఉన్నప్పుడే 1970ల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆపై జనతా పార్టీలో చేరారు. 1977లో తొలిసారిగా హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కేవలం 25 ఏళ్ల వయసులో రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మనదేశంలో అత్యంత పిన్న వయసులో కేబినెట్‌ మంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి ఆమే. 27 ఏళ్ల వయసులో హరియాణా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

 

IHG

 

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి 1998 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం సుష్మాస్వరాజ్‌ను రంగంలో దింపింది. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో సుష్మా దిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 2014 మే 26 నుంచి 2019 మే 30 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మహిళ సుష్మే. నేటి యువతకు ఆమె ఆదర్శం.

మరింత సమాచారం తెలుసుకోండి: