ఈ యావత్ జగతిలో స్త్రీ, పురుషులలో ఎవరు ముందు పుట్టారు? అన్న ప్రశ్నలోంచి శాస్త్రవేత్తలు అనేకమైన  జన్యు పరమైన పరిశోధనలు జరిపారు. కడకు, పురుషునికన్నా ముందే స్త్రీ జన్మించినట్టు వారు నిర్ధారించారు. ఇందుకు ఎక్స్, వై క్రోమోజోములు, మైటోకాండ్రియా  తోడ్పడ్డాయని వారు చెబుతున్నారు. ఆడవారిలో ఎక్స్-ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. జన్యుపరంగా రెండు ఎక్స్ క్రోమోజోములు ఉండడం వల్లే వారు మానసికంగా, మగ వారికంటే చాలా బలం కలిగి వున్నారని వారు పేర్కొన్నారు.

 

IHG

 

పురుషుడి మెదడు స్త్రీ మస్తిష్కం కన్నా, 8 శాతం పెద్దదని మనం చిన్నప్పటినుండి చదువుకున్నాం. స్త్రీ మెదడులోని నాడీకణాలు మగవారికన్నా కుడి ఎడమల వైపు ఎక్కువగా విస్తరించి ఉంటాయనేది మనకు విదితమే. అదే మగవారిలో అయితే మాత్రం, మెదడుకు ముందు, వెనుక భాగాలకు నాడీకణాలు వ్యాపించి వుంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. మెదడులోని ఈ నిర్మాణ పరమైన తేడావలననే స్త్రీలు సరైన రీతిలో, తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నట్టు వారు నిర్ధారించారు.

 

ఇక జ్ఞాపకశక్తిలోను స్త్రీలదే పై చేయట. ఎందుకంటే, స్త్రీలకు మెదడులోని ప్రధానభాగం ఎక్కువమేర ఉంటుంది. ఈ ప్రాంతంలోనే జ్ఞాపకాలు విశేషంగా నిక్షిప్తమై ఉంటాయనేది వారి విశ్లేషణ. మెదడులో నిక్షిప్తమైన వివిధాంశాలు.. జ్ఞాపకాలు, భావావేశాలు, ముఖాలు, ప్లేసెస్ లను గుర్తించే శక్తి కూడా మగాళ్ల కంటే, ఆడవారే మెరుగని వారు బల్ల గుద్ది మరి చెబుతున్నారు.

 

IHG

 

ఇక పని వేళల్లో కలిగే ఒత్తిడికి ‘స్టెరాయిడ్ హార్మోన్' స్థాయి మగవారిలోకంటే ఆడవారిలో రెండింతలు ఎక్కువని వారు గుర్తించారు. అడవారు కలివిడిగా లేకుంటే మాత్రం, వారిలో కావలసినంత ‘ఆక్సిటోసిన్' విడుదల కాలేదని మనం అర్థం చేసుకోవాలని వారు సూచించారు. ఆ పరిస్థితుల్లో వారు ఒత్తిడినుంచి మామూలు పరిస్థితికి అంట ఈజీగా రాలేరట! ఇక చివరగా చెప్పేదేమంటే, పురుషులకన్నా స్త్రీలే ఎక్కువ కాలం జీవిస్తారని వారు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: