ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రస్ట్ చైర్మన్ ని మారుస్తూ జీవో విడుదల చేయడం ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ ఒక్క రోజులో జరిగిపోయాయి. దీనికి సంబంధించి ముందు ఏ హడావుడి రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. దీనిపై ఇప్పుడు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు; పార్టీ నేతల ఆర్ధిక మూలాల మీద దాడులు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. 

 

ఇక ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. ట్రస్ట్ నిర్వహణ సరిగా లేదని ఆరోపణలు వచ్చాయని అందుకే ట్రస్ట్ చైర్మన్ ని తప్పించామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే విచారణ జరిపి అన్ని విషయాలను బయటపెడతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉంటే... ఇప్పుడు అశోక గజపతి రాజు టీడీపీకి రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి తనకు సరైన మద్దతు రాలేదనే అసహనంలో ఆయన ఉన్నారని అంటున్నారు. 

 

ఆయన రాజీనామా చేయడానికి సిద్దమయ్యారని, త్వరలో రాజీనామా చేయడానికి ఆయన అంతా సిద్దం చేసుకున్నారని,  తనను ప్రభుత్వం దెబ్బ తీస్తున్నా సరే కనీసం చంద్రబాబు స్పందించడం లేదని, తనను పిలిచి మాట్లాడటం గాని ఫోన్ చేయడం గాని ఏ ఒక్కటి లేదని ఆయన అసహనంగా ఉన్నారట. ఇప్పటికే పార్టీ కీలక నేతల వద్ద ఈ రాజీనామా వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రెండు మూడు రోజుల్లో చంద్రబాబు కి లేఖ రాసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఆయన రాజీనామా చేయడ౦తో పాటుగా ఇక రాజకీయాల నుంచి కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: