చైనాలోని వుహాన్ దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజా వణికిస్తోన్న విషయం తెలిసిందే. డ్రాగన్ దేశం నుండి పుట్టిన ఈ వైరస్ 3400 మందిని బలి తీసుకుంది. 1,00,000 మందికి పైగా కరోనా భారీన పడ్డారు. తెలంగాణలో వేరే దేశం నుండి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం గురించి సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా ఇప్పటివరకూ నమోదు కాలేదని అన్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒక వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. అతి త్వరలో ఆ వ్యక్తి కూడా ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని సీఎం చెప్పారు. 
 
ప్రభుత్వం మాస్క్‌లు పంపిణీ చేయడం లేదనే ఆరోపణల గురించి సీఎం స్పందించారు. కరోనా లేనప్పుడు మాస్కులు ఎందుకని ప్రశ్నించారు. కరోనా 22 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో బ్రతకదని రాష్ట్రంలో ఉషోగ్రతలు 30 డిగ్రీలు దాటాయని అందువలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని అన్నారు. కరోనా వస్తే చనిపోతారని జరుగుతున్న ప్రచారం గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఒక శాస్త్రవేత్త తనకు ఫోన్ చేసి కరోనా వస్తే చనిపోతారని వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారని కేసీఆర్ అన్నారు. కరోనా సోకితే జ్వరం వస్తే వేసుకునే ప్యారసిటమాల్ వేసుకుంటే చాలని శాస్త్రవేత్త తనతో చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందితే కరోనాను అడ్డుకోవడానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టటానికైనా సిద్ధమని అన్నారు. కరోనా ఇక్కడ పుట్టిన జబ్బు కాదని చైనాలో పుట్టిన జబ్బు అని కేసీఆర్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: