కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ వేదికగా ఇచ్చిన ప్రసంగం తో అసెంబ్లీ మొత్తం దద్దరిల్లిపోయింది. రాష్ట్రంలోని అన్ని అంశాలను ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి  అంశాన్ని లేవనెత్తి అధికార పార్టీ  తీరుని ఎండగడుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఇప్పటివరకు అధికార పార్టీ తీరును ప్రశ్నించే అసలు ఎమ్మెల్యేలు లేరు అనుకుంటున్న తరుణంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ తీరును కడిగేసింది. ఈరోజు అసెంబ్లీ వేదికగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ముందుగా గవర్నర్ గురించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళా గవర్నర్ గారు మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉందని కానీ గవర్నర్ గారి మాటల్లో.. ప్రభుత్వాన్ని పొగడడం తప్ప.. రాష్ట్రంలోని సమస్యల గురించి ప్రజల పరిస్థితి గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా వినిపించలేదు అంటూ సీతక్క అంటూ తెలిపింది. గవర్నర్ గారు ప్రసంగంలో ప్రజల సమస్యల గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అంటూ సీతక్క తెలిపింది. 

 


 అయితే గవర్నర్ గారి తో పాటు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ... గత ప్రభుత్వం రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది అని అంటున్నారని.. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలోని సగం మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ.. గత ప్రభుత్వ పాలనలో భాగస్వాములు అయిన వారే అని గుర్తు చేసింది ఎమ్మెల్యే సీతక్క. గతంలో బీభత్సం సృష్టించారు అంటున్న పాలనలో... అన్ని నిర్ణయాలలో ఇప్పుడున్న పాలకులు కూడా భాగస్వాములే ఉన్నారని.. అది మరచిపోయి గత ప్రభుత్వం బీభత్సం సృష్టించింది అని అంటున్నారని...  ఈ తీరు మార్చుకోవాలి అంటూ అసెంబ్లీ వేదికగా స్వరం వినిపించింది ఎమ్మెల్యే సీతక్క. కేవలం ఆరు సంవత్సరాల లోనే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందింది అంటూ టిఆర్ఎస్ పార్టీ నేతలు  అంటున్నారని గత ప్రభుత్వాలు ఏం చేయకుండానే ఆరు సంవత్సరాల్లో కేవలం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అంటూ ప్రశ్నించింది. 

 


 గత ప్రభుత్వాలు టిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే  సమయంలో 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ అందించారని.. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మారిపోయింది అంటూ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రాష్ట్రంలో సంపద ఎంత ఉంది.. వివిధ పథకాల వల్ల లోటు బడ్జెట్ ఉంటుందా లేదా మిగులు బడ్జెట్ ఉంటుంద అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సీతక్క అసెంబ్లీ వేదికగా తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని దీనికి కారణం మద్యం అనే విషయం ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అంటూ సీతక్క ఈ సందర్భంగా వెల్లడించింది. ఇక ఎమ్మెల్యే సీతక్క పూర్తి ప్రసంగం కోసం ఈ కింది వీడియోలో చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: