ఈ మద్య కొంత మంది అధికారులపై బాధితులు మాటలతో సిరియస్ అవుతున్నారు.. కొన్ని సార్లు హద్దులు కూడా దాటుతున్నారు.  అయితే తెలంగాణలో ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయా రెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనలో ఆమె తో పాటు తర్వాత మరో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భూ వివాదాల కేసుల్లో వత్తిడికి లోనైన బాధితుడు ఆమెపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పపడ్డారని అన్నారు.  మరోవైపు విజయా రెడ్డి నిజాయితీ గల ఆఫీసర్ అని సహ ఉద్యోగులు అన్నారు.  ఏది ఏమైనా ఈ మద్య ప్రభుత్వ అధికారులపై కొంత మంది తమ పనులు చేయకపోతే పెట్రోల్ పోసి చంపుతామని బెదిరింపులకు  దిగుతున్న విషయం తెలిసిందే. 

 

తాజాగా తనకు రావాల్సిన వేతనం కోత విధించారని ఆరోపిస్తూ ఓ మహిళ ఏకంగా ప్రభుత్వ కార్యాలయం లో పెట్రోల్ దాడికి పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్టణం లో కలకలం రేగింది.  అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్‌పై ఓ ఔట్ సోర్స్ సూపర్ వైజర్ పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న సహోద్యోగులు వెంటనే స్పందించి, అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో వెంటనే మాట మార్చిన ఔట్ సోర్స్ సూపర్ వైజర్ అన్నామణి తానూ ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ తెచ్చుకున్నట్టు తెలిపింది.  శానిటరీ సూపర్ వైజర్గా పనిచేస్తున్న అన్నామణి తనకు రావాల్సిన వేతనంలో అధికారులు కోత విధించి తనను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం కార్యాలయానికి పెట్రోల్ బాటిల్ తో వచ్చింది.

 

కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఎంహెచ్ఓ లక్ష్మీతులసి పై పెట్రోల్ తో దాడికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించి పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే తేరుకొని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. కాగా,  అధికారిణి లక్ష్మీ తులసి స్పందించారు. అన్నామణి గతంలో 20 రోజుల పాటు విధులకు హాజరు కాకుండా సెలవు పెట్టిందని అందుకే తన జీతంలో కోత విధించాల్సి వచ్చిందని వివరించారు.ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: