ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే ఆమె స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ కు తొలి మహిళా హోంమంత్రిగా తిరుగులేని రికార్డ్ సొంతం చేసుకునే వరకు వెళ్లారు. సుచరిత తండ్రి నుంచి... ఆయన సోదరులు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో ఫిరంగిపురం నుంచి జెడ్పీటీసీ గా గెలుపొందిన సుచరిత జడ్పీ చైర్మన్ రేసులో నిలిచారు. అయితే అప్పుడు ఆ పదవి కూచిపూడి విజయ కు దక్కింది. 2009 ఎన్నికల్లో జిల్లాలోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ కావడంతో సుచరిత అక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.



వైఎస్ మరణానంతరం ఆయన ఫ్యామిలీ వెంట నడిచి తన ఎమ్మెల్యే పదవిని ఆమె తృణప్రాయంగా వదులుకున్నారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు. 2019 ఎన్నికల్లో నుంచి మరోసారి పోటీచేసిన సుచరిత రాజకీయ ఉద్దండుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ... మరో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఓడించి జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచారు.



ఈ క్రమంలోనే జగన్ తనపై ఆమెకు ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ తన కేబినెట్లోకి తీసుకోవడంతో పాటు... ఎవరు ఊహించని విధంగా కీలకమైన హోంశాఖ కట్టబెట్టారు. తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ముందు స‌బితా ఇంద్రారెడ్డి త‌ర్వాత ఏ మ‌హిళ‌కు కూడా హోం శాఖ ద‌క్క‌లేదు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో మాత్రం సుచ‌రిత తొలి మ‌హిళా హోం మంత్రిగా మిగిలి పోనున్నారు. హోం మంత్రిగా కీల‌క‌మైన దిశ పోలీస్ స్టేష‌న్ల‌తో పాటు ఏపీలో ప్ర‌జ‌లు, మ‌హిళల భ‌ద్ర‌త విష‌యంలో ఎన్నో కీల‌క సంస్క‌ర‌న‌లు ఆమె పాల‌న‌లో రావ‌డం విశేషం. అదే టైంలో ఆమె నియోజ‌క‌వ‌ర్గ‌మైన ప్ర‌త్తిపాడులో కూడా దూసుకుపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: