స్థానిక సంస్థల ఎన్నికలు చాలామంది కఠిన పరీక్షగా మారిపోయాయి. అటు అధికార వైసీపీకి పరువు సమస్యగా మారగా, ఇటు ప్రతిపక్ష టీడీపీకు చావుబ్రతుకు సమస్య అయిపోయింది. ఇక పార్టీల పరిస్థితి అలా ఉంచితే, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు స్థానిక ఎన్నికల ద్వారా పెద్ద పరిక్షే ఎదుర్కొనున్నారు. ఈ ఇద్దరు ఉన్నది టీడీపీ కంచుకోటల్లో కాబట్టి వీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసముంది. ముఖ్యంగా గన్నవరం ముందు నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంది.

 

2019 ఎన్నికల్లో కూడా వైసీపీ గాలి ఉన్న టీడీపీ తరుపున వల్లభనేని వంశీ విజయం సాధించారు. కానీ ఒక్కసారిగా అధికారం కోల్పోవడం, నియోజకవర్గంలో పలు సమస్యలు తెరపైకి రావడంతో, వంశీ వైసీపీకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరకపోయినా...రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల్లో వంశీ వైసీపీ గెలుపు కృషి చేయనున్నారు. టీడీపీకి కంచుకోట లాంటి గన్నవరంలో వంశీ ఏ మేర వరకు వైసీపీని గెలిపిస్తారనేది ఆసక్తిగా మారింది.

 

కాకపోతే వంశీకి పర్సనల్ ఇమేజ్ ఉండటం కలిసొచ్చే అంశం. అలాగే ఇక్కడ వైసీపీకి కూడా స్ట్రాంగ్ కేడర్ ఉంది. అటు అపోజిట్‌లో టీడీపీని నడిపించే నాయకుడు లేడు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఇన్‌చార్జ్‌ని నియమించిన పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి గన్నవరంలో వైసీపీనే మెజారిటీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, పంచాయితీలని గెలిచే అవకాశముంది. ఇక అటు గుంటూరు వెస్ట్ లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి, వంశీ మాదిరిగానే వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు.

 

అయితే గుంటూరు వెస్ట్‌ ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉంటుందని, 2014, 2019 ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు గిరి వైసీపీ తరుపున పని చేసి, ఆ పార్టీని గెలిపించాలి. వెస్ట్ మొత్తం గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. మరి గుంటూరు కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో పడాలంటే వెస్ట్ కీలకం. కానీ అమరావతి ఇష్యూ వల్ల వైసీపీకి ఏ మేర ఓట్లు పడతాయనేది చూడాలి. ఇక్కడ టీడీపీకే కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది. దీంతో మద్దాలి గిరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మరి ఈ కఠిన పరీక్షలో ఎవరు నెగ్గుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: