తెలంగాణ కోసం పోరాడి.. ఆమరణ నిరాహార దీక్ష చేసి అప్పటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధనకు కృషి చేసిన నేటి సీఎం కేసీఆర్ కి రెండు సార్లు పట్టం కట్టారు.  తాజాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తెలంగాణ శాసనమండలిలో ఆయన ప్రసంగించారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ అన్నారు.  ప్రజలకు లేనీ పోని హామీలు ఇవ్వనని.. ఒకవేళ నేను ఏ హామీ ఇచ్చిన.. అది తప్పకుండా నెరవేరుస్తానని అన్నారు. 

 

ఇప్పటి వరకు తెలంగాణ లో ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టామని.. మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ పథకం, 24 గంటలు కరెంట్ సప్లై, రైతు బంధు ఇలా ఎన్నో పథకాలు అమలు పరుస్తున్నారు... ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అని అన్నారు.  ఎక్కడన్నా కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి తెలంగాణకు ఉందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మభ్య పెట్టే పనులు చేయొద్దని విపక్షాలకు ఆయన హితవు పలికారు.  యువతను స్వయం ఉపాధి వైపు అవకాశాలు కల్పించి వారి అభ్యున్నతికి పాటు పడుతామని అన్నారు.  ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేసే ప్రభుత్వ కాదు అని అన్నారు.

 

డిఫెన్స్,  రైల్వే, బ్యాంకింగ్ రంగాల్లోకి  తెలంగాణ యువత వెళ్లడం లేదని,  ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయో యువతకు తెలియజేస్తామని చెప్పారు.  ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని, ఐటీ రంగంలో హైదరాబాద్ లో దాదాపు ఏడు లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిపక్ష నేతలు ప్రజలను మభ్య పెట్టడానికి.. లేని పోని అపోహలు కల్పించడానకే ఉన్నారని.. వాస్తవికతను వారికి తెలియజేసి వారి నమ్మకాన్ని పొందాలని హితవు పలికారు.  తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు.. వారి త్యాగాల ఫలితాన్ని అభివృద్దితో చూపిస్తామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: