కేసీయార్ తెలంగాణా సీఎం. ఆయన సాధారణంగా బయట విషయాలు మాట్లాడరు. ఆ మాటకు వస్తే తన సొంత రాష్ట్రం విషయాలు కూడా ఆయన ఎపుడూ పెద్దగా పదవి విప్పి పంచుకున్నది ఉండదు. అన్నీ కూడా అయన కొడుకు, మంత్రి అయిన కేటీయార్ చేసుకుపోతారు. అటువంటి కేసీయార్ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎక్కువగా మాట్లాడుతారు.

 

ఆయన తెలంగాణా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసిన కొన్న కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు కాస్తా 25 జిల్లాలకు మారుతాయని కేసీయార్ చెప్పడం విశేషం. తొందరలోనే ఈ పరిణామం చోటుచేసుకోబోతుందని కూడా కేసీయార్ అంటున్నారు.

 

మరి జగన్ ఆయనతో ఈ విషయం పంచుకున్నారనుకోవాలి. లేకపోతే కేసీయార్ ఏపీ ఫ్యూచర్ గురించి ఎలా చెప్పగలరు. ఇక కేసీయార్ ఏపీ గురించి మాట్లాడుతూ జగన్ తన బాటలో నడుస్తున్నట్లుగా ఇండైరెక్ట్ గా చెప్పుకున్నారు. 

 

తాను పది జిల్లాల తెలంగాణాను 31 జిల్లాలుగా చేసి సమగ్ర అభివ్రుద్ధి సాధించానని, అదే విధంగా జగన్ కూడా ఉన్న జిల్లాలను రెట్టింపు చేయడం ద్వారా ఏపీలో కూడా సర్వతోముఖాభివ్రుద్ధికి బాటలు వేయాలనుకుంటున్నారని కేసీయార్ పేర్కొన్నారు. అంటే జగన్ తన విధానాలను అనుసరిస్తారని, తాను మంచి పరిపాలకుడిని అని చెప్పుకోవడానికి జగన్ ప్రస్తావని తెచ్చారనుకోవాలి.

 

అదే నిజమైతే జగన్ దిశ చట్టాన్ని ఏపీలో తెచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారు. ఇక మద్య నిషేధాన్ని బాగానే  అమలుచేస్తున్నారు. మరి ఇవన్నీ ఆయన‌కు ఎవరు చెప్పారు, ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అనుసరిస్తున్నాయిగా. ఏది ఏమైనా మంచి నిర్ణయాలు చేస్తే పది మంది మెచ్చుకుంటారు. పాలకులు ఎంతటి వారైనా వాటిని స్వీకరిస్తే అదే ప్రజలకు పదివేలు అంటున్నారు సాదర జనం.  తెలుగు రాష్ట్రాలు కూడా అలాగే అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని కూడా కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: