ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా ఆ పార్టీ అధినేత జగన్ కు తయారయ్యింది. వైసీపీకి ఏపీ అసెంబ్లీలో 151 స్థానాలు దక్కడంతో రాజ్యసభలో నాలుగు స్థానాలు వైసీపీకి దక్కబోతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవడంతో అభ్యర్థుల ఎంపిక ఇక పూర్తి చేయాల్సిన సమయం వచ్చేసింది. దీంతో జగన్ ఎవరు వైపు మొగ్గు చూపుతారు అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే చాలా మంది జగన్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ.. అన్ని మార్గాల ద్వారా జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా మూడు స్థానాలు ఎలా ఉన్నా, బీసీలకు తప్పనిసరిగా ఒక స్థానం కల్పించాలని జగన్ ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో పార్టీలో వీర విధేయులుగా తనకు అండగా ఉంటూ వస్తున్నారు.

IHG


 ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈ ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం ఇవ్వాలని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే అంతకు ముందు ఈ ఇద్దరికీ రాజ్యసభ స్థానం కల్పిస్తారు అని ప్రచారం జరిగినా మారిన రాజకీయ సమీకరణాలతో ఒకరికే అవకాశం ఇవ్వాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయడం, అది ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉండటంతో దీనిపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే శాసన మండలి రద్దు అవుతుంది. అదే జరిగితే ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవులు పొందిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. 


అందుకే ఈ ఇద్దరికీ రాజ్యసభ స్థానాలు కట్టబెడతారని ప్రచారం జరిగినా, ఇప్పుడు ఒక్కరికి మాత్రమే రాజ్యసభ స్థానం కట్టబెట్టి మరొకరికి రాష్ట్రస్థాయి పదవి ఏదైనా ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి పదవి దక్కుతుంది అనేది ఉత్కంఠగా మారింది. అయితే జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైపు మొగ్గు చూపుతారని ఎక్కువగా ప్రచారం జరుగుతుంటే, కాదు కాదు జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి వెంకట రమణ జైలుకి కూడా వెళ్లి వచ్చారు కాబట్టి జగన్ మోపిదేవిని రాజ్యసభకు పంపిస్తారని మరో ప్రచారం మొదలయ్యింది. ఈ ఇద్దరిలో జగన్ కరుణ ఎవరిమీద ఉంటుందో అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: