కరోనా వైరస్ రోజురోజుకూ తన ప్రతాపం చూపుతోంది. ఈ వైర కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప.. మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య లక్షా రెండు వేలకు చేరింది. ఇప్పటి వరకూ కరోనా ప్రభావం కనిపిస్తున్న దేశాల సంఖ్య 94 కు చేరింది. అంటే త్వరలోనే కరోనా సెంచరీ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

అంతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రోజుకో వెయ్యి కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. కనీసం రోజూ 50 మంది వరకూ ఈ వైరస్ కారణంగా చనిపోతున్నారు. ఒక్క చైనాలోనే కరోనా కేసుల సంఖ్య 80 వేలు దాటింది. చైనాలో ఇప్పటివరకూ మూడవేల మందికి పైగా మరణించారు. కొత్తగా చైనాలో రోజుకు కనీసం వంద కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంటే కొత్తవి వంద కేసులు వస్తుంటే.. రోజూ కనీసం 40 మంది వరకూ చనిపోతున్నారు.

 

 

చైనాను కట్టడి చేస్తున్న చైనా పరిస్థితే ఇలా ఉంటే... ఇక చైనా బయట వివిధ దేశాల్లో ఇప్పటి వరకూ 22 వేల కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. చైనా బయట దాదాపు 400కు పైగానే మరణించారు. చైనా బయట ఎక్కువగా దక్షిణ కొరియాలో కరోనా కేసులున్నాయి. ఇక్కడ 6 వేలకు వైగా కేసులు నమోదయ్యాయి. 50 మంది వరకూ ఈ దేశంలో మరణించారు. ఇంకా ఇరాన్‌, ఇటలీ, జర్మనీ, కొలంబియా, కోస్టారికా, అమెరికా, కెనడా.. ఇలా కరోనా బారిన పడని దేశాలు చాలా తక్కువ.

 

 

మనదేశం విషయానికి వస్తే.. కేసులు చాలా తక్కువే అని చెప్పాలి.. దాదాపు 30 మందికి పైగా వైరస్ వచ్చినట్టు గుర్తించినా వారంతా విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనించాల్సిన విషయం. ఇక కరోనా కారణంగా ఇండియాలో ఇంత వరకూ ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: