తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిన్న తెలంగాణ అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు సభ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడడం, వారిని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్క రోజు సస్పెండ్ చేయడం జరిగాయి. అయితే ఈ విషయంతో పాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, తెలంగాణలో ఇంతకంటే దారుణమైన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని, కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

 

IHG


 రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజమని, గొప్ప నాయకుడిగా పేరుపొందిన ఇందిరాగాంధీ ఒక సామాన్య నాయకుడైన రాజనారాయణ చేతిలో ఓడిపోయారు అని కేసీఆర్ గుర్తు చేశారు. అలాగే గొప్ప విజయాలు సాధించిన ఎన్టీఆర్ కూడా ఓటమి చెందారు అని ఆయన అన్నారు. కాలం కలిసి రానప్పుడు అధికారమే పరమావధిగా ఉండకూడదని ప్రజల దయ మేరకు ఎన్నిక జరుగుతుందని, అధికారం లేదని పూర్తిగా నిరాశ నిస్పృహలకు గురై ఎదుటి వారిపై అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. 

IHG


సభలో ఎంత మంది సభ్యులు ఉన్నా, అసెంబ్లీలో ఒకరిద్దరు సభ్యులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరని కెసిఆర్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ్యులపై కేసీఆర్ అనేక విమర్శలు చేశారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసినా కెసిఆర్ లో మాత్రం ఆ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ఉన్న కోపం ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ ఆగ్రహానికి గురయ్యి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: