మనిషి జీవితం మారడానికి క్షణం చాలు అంటారు.. ఇన్నాళ్లూ అన్నవాళ్లే గాని కళ్లారా చూసిన వారు లేరని అనుకునే వారు.. కానీ దీనికి ప్రత్యక్ష సాక్షి చైనా.. కొద్దిరోజుల క్రితం వరకు ఎవరూ ఊహించని విధంగా జీవితం అంటే అన్నీ తింటూ ఆనందంగా నచ్చినట్లు బ్రతకడం అని అనుకునే చైనా ప్రజలు ఇప్పుడు దిక్కులేని అనాధలా బ్రతుకుతున్నారు.. కన్న వారు, కట్టుకున్న వారు కళ్లముందు ఉన్నా మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్దితులు అక్కడ నెలకొన్నాయి.. దీనికంతటికి కారణం చైనాలో పుట్టిన కరోనా వైరస్..

 

 

ఈ వైరస్ బారినా పడిన ఎందరో ప్రజలు మృత్యువు ఒడిని చేరారు.. ఇంకా మృత్యువుతో పోరాడుతున్నారు.. ఇక ఈ వైరస్ అక్కడ వ్యాప్తి చెందగానే వేలాది జనానికి చికిత్స అందించేందుకు అక్కడి హస్పటల్స్ సరిపోకపోవడంతో, చైనా ప్రభుత్వం హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, పాఠశాలలు, కాలేజీలు, ఆడిటోరియంలను ఆస్పత్రులుగా మార్చివేసింది. ఈక్రమంలోనే ఫ్యూజియాన్ ప్రావిన్స్‌ క్వాన్‌జౌ నగరంలో కరోనా బాధితులకు చికిత్సాలయంగా ఏర్పాటు చేసిన ఓ హోటల్‌ భవనం శనివారం కుప్పకూలింది.. ఇక ఈ ప్రమాద ఘటనలో సుమారుగా 80 మంది వరకు కరోనా బాధితులు శిథిలాల్లో చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.

 

 

ఇలా చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు వేగవంతంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 35 మందిని రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఫ్యూజియాన్ ప్రావిన్స్‌లో 296 కరోనా కేసులు నమోదయ్యాయని, పదివేలకు పైగా కరోనా అనుమానితులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే తాజాగా ప్రమాదానికి గురైన ఈ ఐదంతస్తుల హోటల్‌ను క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. 2018 జూన్‌లో ప్రారంభమైన ఈ హోటల్‌లో 80 గదులు ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

అయితే.. ఈ హోటల్ ఒక్కసారిగా కుప్పకూలడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పటికే కరోనాతో సతమతం అవుతున్న చైనాకు ఈ ప్రమాదం ఒకరకంగా మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లుగా ఉంది.. కాలం కలిసి రాకపోతే తాడే పాములా మారి ప్రాణం తీస్తుంది.. ఇదంతా విధిరాత అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసినవారు..

మరింత సమాచారం తెలుసుకోండి: