ఎవరు ఆ ఇండియా డాటర్ అనుకుంటున్నారా? ఇంకెవరు? ''నిర్భయ''.. ఈ నిర్భయ ఘటన గురించి ఎంత చెప్పిన తక్కువే.. 9 గంటల సమయంలో అమ్మాయి బస్సు ఎక్కితే 11 గంటలకు కారుతున్న రక్తంతో బట్టలు కూడా లేకుండా నడిరోడ్డుపై ఆ యువతీ పడింది. అది కూడా 5 పర్సెంట్ పేగులతో. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? ఆశ్చర్యంలో తప్పు లేదు. ఎందుకంటే... అంత దారుణమైన ఘటన అది. ఇంకా అసలు కథలోకి వెళ్తే.. 2012 డిసెంబర్ 16.. చలికాలం అది. ఆ సమయంలో ఓ యువతీ, యువకుడు ప్రైవేట్ బస్సు ఎక్కారు. 

 

ఆ బస్సులో కేవలం డ్రైవర్ తో సహా ఆరుమంది ఉన్నారు. అంతే.. కొద్దీ సమయానికి ఆ ఆరుమందిలో ఒకరు వచ్చి.. ఎందుకు ఇంతవరుకు బయట ఉన్నావ్ అంటూ అమ్మాయిపై చెయ్యి వేశాడు. అనంతరం ఆమె తిట్టడంతో కోపంతో ఊగిపోయిన వారు ఆమెని, ఆమె స్నేహితుడును ఇనుప రాడ్ తో కొట్టారు. అత్యాచారణానికి సహకరించమని ఆమెకు ఎంత చెప్పిన వినకపోయేసరికి పక్కనే ఉన్న రాడ్ తో కొట్టారు. దారుణంగా ఆ ఆరుమంది ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అయినప్పటికీ వారికీ ఇంకా కసి తిరక ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో రాడ్ పెట్టి దాదాపు 95 శాతం పేగులను బయటకు తీశారు ఆ నీచులు. 

 

ఈ ఘటన జరిగిన 14 రోజులకు నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి మరణించింది. అయితే అప్పట్లో ఈ కేసుపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ నిరసనలకు ఫలితంగా ఆ నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే ఆ నీచులలో ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించగా.. మరొకరు టీనేజర్ అని ఉరి నుండి తప్పించుకున్నాడు. అయితే మిగితా నాలుగురు గత 8 ఏళ్ళ నుండి పందులు మేసినట్టు జైల్లో మేశారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిందితులకు ఉరి శిక్ష ఖరారైంది.

 

అయితే వారికీ ఇప్పటికే మూడు సార్లు ఉరి శిక్ష పడింది. కానీ మూడు సార్లు తప్పించుకున్నారు. న్యాయవ్యవస్థతో ఆ నలుగురు నిందితులు ఫుడ్ బాల్ ఆడుకుంటున్నారు. ఆ ఆటను చూస్తే వీళ్ళను న్యాయంగా ఎందుకు చంపాలి? వీళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేస్తే సరిపోతుంది అని అనిపించేలా వాళ్ళు న్యాయవ్యవస్దతో ఫుట్ బాల్ ఆడుతున్నారు. 

 

నలుగురు ఉన్నారు.. ఒకరి తర్వాత ఒకరు క్షమాభిక్ష పిటిషన్ వేస్తారు.. జైల్లోనే తలలు పగలడోట్టుకుంటారు.. ఆ నీచులపై రేప్ జరిగింది అని కోర్టులో పిటిషన్ వేస్తారు. అబ్బబ్బా.. ఒకటి కాదు చాలా చేస్తున్నారు. వీళ్లకు తోడు విల్లా లాయర్లు కూడా అంతే. ప్రతిసారి వాళ్ళను కాపాడటానికి ఏదో ఒక సాకు వెతుకుతారు. 

 

ఎట్టకేలకు.. ఇప్పుడు నాలుగోసారి వారికీ ఉరి శిక్ష పడే తేదీ దగ్గరయింది. ఆ తేదీ ఏదో కాదు.. మర్చి 20. అంతే సరిగ్గా 13 రోజులు ఉంది. ఇప్పుడు మరి ఇంకో సాకును తెర మీదకు తీసుకువచ్చారు. అది ఏంటి అంటే? ఇన్నాళ్లు ఏ లాయర్లు అయితే వాళ్ళ ప్రాణాలు కాపాడారో.. ఆ లాయర్లపైనే కేసులు వేశారు.. ఈ కేసుపై ప్రజల అభిప్రాయం ఏంటంటే.. ఆ కేసులు కూడా కావాలనే వాళ్ళ లాయర్లు వేయించుకొంటారు అని అభిప్రాయపడుతున్నారు. 

 

అయితే వీళ్ళు అదే ఆటల్లో న్యాయస్థానం ఒకటైతే... నిర్భయ తల్లి ఒకరు. పాపం.. వాళ్లకు జీవిత ఖైదు.. అంతకంటే శిక్ష లేదు అని అనింటే అప్పుడే ఆమె మర్చిపోయేది.. కానీ ఉరిశిక్ష ఉంటుంది.. ఆ నీచులను చంపేస్తాం అని ఆమెకు చెప్పి ఇప్పుడు బిడ్డకు న్యాయం జరుగుతుంది అని వెళ్లిన ప్రతిసారి ఆమెకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నిజంగా ఇలాంటి దారుణమైన కష్టం భారత్ లో ఏ తల్లికి రాకూడదు.. ఆ నీచుల నిజం రుజువై కూడా 8 ఏళ్ళు అవుతుంది... నాలుగేళ్ళ పిల్లాడికి కూడా తెలుసు అక్కడ ఎం జరిగింది అనేది..కానీ న్యాయవ్యవస్దలో ఉండే కొన్ని లోపాల కారణంగా ఇలా అయిపోయింది. మరి ఈసారి అయినా ఈ ఇండియా డాటర్ కు న్యాయం జరుగుతుంది ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: