రాజకీయాల్లో కొన్నిసార్లు డైలాగులు బాగా పేలుతుంటాయి. ఒక్కోసారి నాయకులు టార్గెట్ గా కావాలనే డైలాగులు పేలుస్తుంటారు. మరోసారి అవి అనుకోకుండా సమయ స్ఫూర్తిగా వాగ్బాణాలు వదులుతుంటారు. అవి బాగా ట్రెండింగ్ అవుతుంటాయి. మరి ఈ వారం అలాంటి డైలాగులు ఏమున్నాయో ఓసారి చూద్దాం.

 

 

ఈ వారం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని ముందే సమాచారం ఉండటంతో సీఎం జగన్ మంత్రులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయాలని సూచించారు. అంత వరకూ చెబితే బాగానే ఉంటుంది.. కానీ ఆయన అక్కడ చెప్పిన ఓ డైలాగ్ బాగా పేలింది. ఎక్కడైనే వైసీపీ ఓడితే ఆ ప్రాంతానికి చెందిన మంత్రి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేసేయడమే.. నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదంటూ బాంబు పేల్చేశారు.

 

 

ఇది బాగా ట్రెండింగ్ అయ్యింది. ఇక ఏపీలో మరో ట్రెండింగ్ డైలాగ్ ఏంటంటే... ఏపీలోని గుంటూరులో జరిగిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల సభలో.. అసదుద్దీన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... మోడీ అంటే జగన్ కు భయం అన్నారు. అందుకే ఎన్‌పీఆర్ పై తగిన చర్య తీసుకోవడం లేదని విమర్శించారు. అంతే కాదు. ఇదే రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండి ఉంటే.. రెండే రెండు నిమిషాల్లో ఎన్‌పీఆర్‌ ను రాష్ట్రంలో రద్దు చేసేవారని ఘాటుగా కామెంట్ చేశారు.

 

 

ఇక మరో సమావేశంలో జగన్ రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ ను అమలు చేయబోమని చెప్పడం కూడా ట్రెండింగ్ అయ్యింది. రాష్ట్రంలో ముస్లింలు ఎలాంటి భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదని.. 2011 నాటి నిబంధనల అమలు కోసం పట్టుబడతామని జగన్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు తాము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: