రాజకీయాలు అంటే చాలా మంది ఓ సీరియస్ సబ్జక్టు అనుకుంటారు. కానీ అందులోనూ అంతులేని కామెడీ ఉంటుంది. వెదికి చూడాలే కాని.. నాయకుల ప్రకటనల వెనుక.. వారి రాజకీయ వ్యూహాల వెనుక నవ్వు పుట్టించే హాస్యం ఉంటుంది. ఎప్పుడూ సీరియస్ అంశాలే కాదు.. ఇలాంటి నవ్వు పుట్టించే సన్నివేశాల గురించి కూడా చెప్పుకుంటే బావుంటుంది. మరి ఈ వారం అలాంటి కామెడీ సన్నివేశాలు ఏమున్నాయో చూద్దాం..

 

వాస్తవానికి కామెడీ అంటే నిజానికి కామెడీని కామెడీగానే చేయాల్సిన అవసరం లేదు. కామెడీని సీరియస్ గా కూడా చేయొచ్చని నిరూపించారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. ఎందుకంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ కేసు వేసింది బిర్రు ప్రతాపరెడ్డి అనే వ్యక్తి తో పాటు మరికొందరు. ఈ బిర్రు ప్రతాప రెడ్డికి గతంలో చంద్రబాబు ఓ నామినేటెడ్ పదవి కట్టబెట్టారు కూడా.

 

 

ఇప్పుడు అదే చంద్రబాబు... తన రాజకీయ లబ్ది కోసం రిజర్వేషన్లపై కేసులు వేసింది జగన్ మనుషులే అంటూ విమర్శలు చేశారు. నిజంగా ఇది ఎంత కామెడీ వ్యవహారమో అర్థం చేసుకోవచ్చు. దీన్ని వైసీపీ నాయకులు కౌంటర్ చేశారు. అసలు ఆ ప్రతాపరెడ్డి ఎవరో అన్న విషయన్ని బయట పెట్టారు. దీంతో చంద్రబాబు నవ్వుల పాలయ్యారన్న విమర్శలు ఉన్నాయి.

 

 

ఇక మరో కామెడీ అమరావతి ఆందోళనల గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఆందోళనలను అంతా మరచిపోయారు. అదే సమయంలో వారు.. చేసే కామెడీ మరింతగా అదిరిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే.. అమరావతి సమస్యపై ఓ లాయర్ అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు వేశారు. అంతర్జాతీయ న్యాయ స్థానం తన వాదనను వినిపించేందుకు అంగీకరించిందని వార్తలు కూడా వచ్చాయి. ఇది ఫుల్ కామెడీ అంటున్నారు ఏపీ జనం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: