ఓవర్ యాక్షన్.. ఈ పదం మనం నిజ జీవితంలో చాలా సార్లు వాడుతుంటాం. ఇక రాజకీయ నాయకులు కూడా ఏమీ తక్కువ తినలేదు. రాజకీయాల్లోనూ వారు కొన్నిసార్లు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. కానీ.. బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆ ఓవర్ యాక్షన్ జనానికి తెలిసిపోతుంటుంది కూడా. కానీ కొంత మరి సీనియర్ రాజకీయ నాయకులు మాత్రం.. తమది ఓవర్ యాక్షన్ అనే విషయం తెలియకుండా తమ నటనాపటిమతో నెగ్గుకొస్తుంటారు. మరి ఈ వారం అలాంటి ఓవర్ యాక్షన్ ఏంటో చూద్దామా..

 

 

ఈవారం అతి పెద్ద ఓవర్ యాక్షన్ ఎవరిదయ్యా అంటే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీదే అని చెప్పాలి.. ఎదుకంటే.. ఆయన తాను ఈ ఆదివారంతో సామాజిక మాధ్యమాలకు మీడియాకు దూరమయ్యే ఆలోచనలో ఉన్నానంటూ ప్రకటించారు. ఈ ప్రకటన చూసి చాలామంది అవాకయ్యారు. ఎందుకంటే సామాజిక మాధ్యమాల వాడకంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా దిట్ట.. అసలు ఆయన ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ అయ్యిందే సామాజిక మాధ్యమాల ద్వారా.

 

 

మరి అలాంటి మోడీ సామాజిక మాధ్యమాలకు దూరమవుతారా.. ఇదేం ఓవర్ యాక్షన్ అంటూ జనం స్పందించారు. అంతే కాదు.. ప్రధాని ప్రకటన రాజకీయ ప్రకంపనలకూ దారి తీసింది. దీనిపై ప్రతిపక్ష నేతలు అనేక మంది కౌంటర్లు ఇచ్చారు. ఇదంతా సామాజిక మాధ్యమాలపై వేటు వేసే ప్రక్రియలో భాగం కావచ్చని మరికొందరు ఊహించారు. మరి ఇంతకీ ప్రధాని అన్నంత పనిచేస్తారా లేక.. ఇదంతా ఓ వ్యూహం ప్రకారం చేసిన ప్రకటనా అన్నది ఇంకా అర్థం కావాల్సి ఉంది.

 

 

ఇక ఈ వారం మరో ఓవర్ యాక్షన్ బంగి అనంతయ్యది చెప్పుకోవచ్చు. ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వచ్చాయి. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే బంగి అనంతయ్య ఉరి వేసుకుంటుండగా పక్కింటి వారు చూశారని అంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా.. లేక ఇది కూడా ఓ ప్లానింగ్ లో భాగమేనా అన్నది అర్థం కాని విషయం. చంద్రబాబు తనను పట్టించుకోకపోవడం వల్లనే ఈ పని చేశాడని ప్రచారం జరుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: