ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం కొంత కాలంగా హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సస్పెన్షన్ పై కేంద్రం కూడా స్పందించింది. జగన్ సర్కారు చేసింది రైటే అనే రీతిలో స్పందించింది. ఈ స్పందన చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి. ఏబీ సస్పెన్షన్ కరెక్టే నని.. ఎలాంటి తప్పు లేదని కేంద్రం ధ్రువీకరించింది.

 

 

గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన ఇంటెలెజెన్స్ మాజీ ఛీఫ్ ఎబి వెంకటేశ్వరరావుకు ఇది నిజంగా షాక్ వంటిదే. ఆయన సస్పెన్షన్ ను కేంద్ర ప్రభుత్వం సమర్దించింది. వెంకటేశ్వరరావు అవినీతికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ కూడా అభిప్రాయపడింది.

 

 

అంతే కాదు.. ఎబి వీ అవినీతిపై ఏప్రిల్ 7లోగా చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని తాజాగ జగన్ సర్కారును కేంద్ర హోంశాఖ ఆదేశించింది. రూ. 25.50 కోట్ల పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కేంద్రం భావిస్తోంది. ఈ అక్రమాల వెనుక వెంకటేశ్వరరావు హస్తం ఉందని హోంశాఖ పేర్కొంది. పోలీస్‌శాఖ అధునీకరణ పేరుతో ఆయన అవినీతికి పాల్పడ్డారని నిర్థారించింది.

 

 

మరి ఇదంతా జగన్ కావాలనే చేస్తున్నారని.. ఏబీ వెంకటేశ్వరరావు ను వేధిస్తున్నారని ఇటీవల వరకూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు వారంతా ఏమంటారో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: