తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా అధిష్టానం రాజ్యసభ స్థానాలను ఎవరికి కేటాయించబోతుంది అనే దానిపై సర్వత్రా చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ రెండు స్థానాలకు గానూ నలుగురు పేర్లు తెరమీదకు రావడంతో ఇందులో ఎవరికీ కేటాయించని బోతున్నారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. కాగా  టిఆర్ఎస్ నేత పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు కి మరోసారి రాజ్యసభ సీటును కేటాయించేందుకు గులాబీ దళపతి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కే కేశవరావు వయోభారం సహా  ఇతర కారణాల వల్ల కేశవరావుకు ఈసారి రాజ్యసభ సీటు కేటాయించకుండా పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చు అని ప్రచారం జరిగినప్పటికీ... ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మరోసారి కె కేశవ రావు కే  రాజ్యసభ సభ్యత్వం రెన్యూవల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 

 

 

 అయితే ఏపీ కోటాలో రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకున్న కె.కేశవరావు తాజాగా సీఎం కేసీఆర్ ను ఆయన ఛాంబర్లో కలిసినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగానే రాజ్యసభ సీటు విషయంలో ఇద్దరి మధ్య చర్చ జరగగా రాజ్యసభ స్థానం సభ్యత్వం రెన్యూవల్ చేసుకునేందుకు ఈ సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ కె.కేశవరావుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరి రెండో  రాజ్యసభ  స్థానాన్ని  ఎవరికీ కేటాయించ పోతున్నారు అనేది ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. కే కేశవరావుకు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తే మిగతా రాజ్యసభ స్థానాన్ని అధిష్టానం ఎవరికి కేటాయించబోతుంది అనేదానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రెండో  రాజ్యసభ స్థానాన్ని ఓ పారిశ్రామికవేత్తకు  ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. సామాజిక కోణం లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ స్థానాలకు గాను అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ స్థానాలకు ఆశావహులు గా ఉన్న పేర్లలో ప్రముఖ పారిశ్రామికవేత్త హెటిరో డ్రగ్స్ అధినేత  పార్థసారథి రెడ్డి పేరు గత కొంతకాలంగా తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే.

 

 

 ఈ నేపథ్యంలో కవితకు ఏం పదవి కేటాయించే పోతున్నారు అనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంకొన్ని రోజుల్లో ఎమ్మెల్సీ పదవిలు  కూడా కాళీ కానున్న నేపథ్యంలో కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. మంత్రిని చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి గాను.. సీఎం ఓఎస్డీ  దేశపతి శ్రీనివాస్ పేరును కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై ఇంకొన్ని రోజుల్లో స్పష్టత రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: