మహనుభావులు ఎప్పుడో చెప్పారు.. లోకంలో మనిషి ప్రాణాలకంటే డబ్బుకే ఎక్కువ విలువ పెరుగుతుందని, ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘటనలు.. వారి మాటలను నిజం చేస్తున్నాయి.. కానీ చీఫ్‌గా వందరూపాయల కోసం కూడా హత్యలు చేస్తున్నారు.. అంటే ఒక మనిషి ప్రాణం విలువ, వంద లేదా వెయ్యి రూపాయలేనా. కనీసం ఒక వస్తువు కొనాలన్నా వేలల్లో ఖర్చు అవుతుంది.. అలాంటి మనిషిని ఇంత అలుసుగా తీసుకోవడం రాక్షస ప్రవృత్తిగా చెప్పుకోవచ్చూ.. ఇకపోతే ఒక దుండగుడు కేవలం రూ.3 వేల కోసం ఐదుగురిని హతమార్చిన ఘటన కలకలం సృష్టిస్తుంది.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

తిరుచ్చి కంటోన్మెంట్‌ ఒత్తకడై ప్రాంతంలో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ లో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న రాంజీనగర్‌కు చెందిన సెంథిల్‌కుమార్‌ ఈ నెల రెండో తారీఖున రాత్రి సమయంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ లిఫ్ట్‌ లోపల నిద్రించసాగాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ 25 ఏళ్ల యువకుడు సెంథిల్‌ కుమార్‌నూ హత్యచేసేందుకు ప్రయత్నించగా ఆ పెనుగులాటలో అతడు స్పృహ కోల్పోయాడు.. వెంటనే ఆ దుండగుడు అతని జేబులో ఉన్న రూ.1000, సెల్‌ఫోన్‌ అపహరించాడు..

 

 

సృహలోకి వచ్చిన సెంథిల్‌కుమార్‌ ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా, కేసు నమోదు చేసుకున్న వారు షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, అతను చేసిన ఆకృత్యాలు వెలుగుచూశాయి. ఇదివరకు జరిగిన చాలా నేరాలతో ఇతనికి సంబంధం ఉందని, ఆ హంతకుని పేరు రాజేష్‌కుమార్‌, ఇతను పుదుక్కోట్టై జిల్లా, కర్బగకుడికి చెందిన వాడిగా తెలిసింది.. ఇక్కడ ఒకే ప్రదేశంలో గాక గత ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ముగ్గురు వాచ్‌మెన్‌లను, ఇదే విధంగా హతమార్చి నగదు చోరీ చేసినట్లు తెలింది..

 

 

ఇదే కాకుండా  2009లో తన సొంతవూరిలో ఉన్న క్రీడా మైదానంలో నాలుగేళ్ల బాలుడిని, 2015లో ఒక వృద్ధురాలిని హతమార్చినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ముమ్మురంగా గాలించగా హంతకుడైనా రాజేష్‌కుమార్‌ శుక్రవారం కరంబకుడిలో చిక్కాడు.. ఇకపోతే ఈ నీచుడు కేవలం రూ.3 వేల కోసం ఐదుగురిని హతమార్చినట్లు విచారణలో తేలింది. ఎంత విషాదకరమైన విషయం ఇది.. మనుషుల ప్రాణాలు ఇలాంటి సైకోలకు ఇంత అలుసా..? ఇలాంటి వాడు సమాజానికి అవసరమా.. ? 

మరింత సమాచారం తెలుసుకోండి: