గత ఏడాది మిర్యాలగూడంలో ప్రణయ్ హత్య కేసు సంచలనం రేపింది.  తమ కులం కానివాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదన్న కారణంతో అమృత తండ్రి మారుతీరావు ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి ప్రణయ్ ని దారుణంగా చంపించాడు.  ఈ కేసు విషయంలో కొంత కాలం జైల్లో కూడా ఉండి ఆ మద్య బెయిల్ పై వచ్చాడు.  అయితే ప్రణయ్ మరణించే నాటికి ఆయన భార్య అమృత ప్రెగ్నెన్సీ.. అప్పట్లో ఆమెకు ఎంతో సానుభూతి లభించింది.  ఆ సమయంలో తన తండ్రికి కఠిన శిక్ష పడాలని.. తన ప్రేమను చంపినా ఆయన బతకకూడదు అని ఫైర్ అయ్యింది అమృత.  కొంత కాలం తర్వాత ఆమె కోపం తగ్గిపోతుంది.. అందరూ కలిసి పోతారు అనుకుంటూ వచ్చారు. 

 

ఈ మద్య మారుతీరావు ఇంటి ఆవరణలో ఓ డెడ్ బాడీ లభ్యమైందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత స్పందించింది. తన తండ్రి ఆత్మహత్యపై స్పష్టత లేదని తెలిపింది. ఆత్మహత్య వ్యవహారంలో అన్ని అంశాలు తెలియాల్సి ఉందని చెప్పింది.  మారుతీరావు హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో మారుతీరావు రాసినట్లు ఉన్న ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు.

 

అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో గిరిజా నన్ను క్షమించు.. అమృతా అమ్మదగ్గరికి వెళ్లమ్మా అంటూ మారుతీరావు ఆత్మహత్య లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు.  బహుషా మారుతీరావు చివరి కోరిక తన కూతురు తల్లివద్దకు చేరుకోవాలని ఆశపడ్డట్టు తెలుస్తుంది.    అప్పట్లో సినీ ఫక్కీలో సుపారి ఇచ్చి మరీ చంపించిన మారుతీరావు ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: