తెలంగాణ ప్రభుత్వం రాష్ట ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం సొంత స్థలం ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అందేలా బడ్జెట్ లో నిధులు కేటాయించింది. నిధుల లేమి వల్ల క్షేత్ర స్థాయిలో ఆశించిన రీతిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం అమలు కావడం లేదని తెలిసిందే. ప్రభుత్వం బడ్జెట్లో గృహ నిర్మాణం కొరకు 11,917 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. 
 
ప్రభుత్వం 2020 - 2021 ఆర్థిక సంవత్సరంలో సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి లక్ష మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకూ నిరు పేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వగా ఇకనుండి సొంత స్థలం కలిగిన పేదలకు కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 
 
రాష్ట్రంలో చాలా మంది ప్రజలు స్థలం ఉండి ఇళ్లు కట్టుకోలేని స్థితిలో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రధానంగా పేదలకు, రైతులకు పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ రావు తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం సాగునీటి రంగానికి, డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 
బడ్జెట్ లో ఈ పథకానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపక్షాల నోళ్లు మూయించాలని ప్రభుత్వం భావించి భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. ప్రభుత్వం అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించింది. పేద, మధ్య తరగతి వర్గాలకు అధికంగా ప్రయోజనం చేకూరేలా బడ్జెట్ రూపొందించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: