ప్రపంచాన్ని గజ గజ వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ ని వణికిస్తుంది.  చైనాలో పుహాన్ లో  మొదలైన ఈ కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది.  చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఎవ్వరిని వదలడం లేదు.  తాజాగా ఇప్పుడు కరోనా భారత్ లో 39 కి చేరినట్లు చెబుతున్నారు.  గడచిన నాలుగు రోజుల్లో కోవిడ్ బాధితుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.  ఈ కరోనా ఎఫెక్ట్ మొదట కేరళలో వచ్చిందని.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో మొదలైందని అంటున్నారు.  తాజాగాకేరళలో మరో ఐదుగురికి కోవిడ్ ఉన్నట్టు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిలో కరోనా వైరస్ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. 

 

ఇప్పటి వరకు 34 కేసులు ఉండగా ఇఫ్పుడు 39 కి పెరిగింది.  కేరళకు చెందిన ఈ కుటుంబం ఇటీవలే ఇటలీలో పర్యటించినట్టు అధికారులు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కోవిడ్ కేసులు కేరళలోనే నమోదయిన విషయం తెలిసిందే.   కేరళకు చెందిన బాధితుల్లో ముగ్గురు ఇటీవలే ఇటలీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. వీరితోపాటు కాంటాక్ట్‌లో ఉన్న మరో ఇద్దరు కుటుంబసభ్యులకు కోవిడ్ సంక్రమించింది.  వారికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చారు. పథనంతిట్ట జిల్లాలోని తమ ఇంటికి చేరుకున్నాక వారి ఇంట్లోని మరో ఇద్దరికి సోకింది' అని ఆమె ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

 

కాగా, ఇటలీ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోని హెల్ప్ డెస్క్, సమీపంలోని హాస్పిటల్‌కు బాధితులు రిపోర్ట్ చేయలేదని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ్ తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు బయటపడటంతో వారిని క్వారంటెయిన్‌లో ఉంచినట్టు వెల్లడించారు.  అయితే భారత్ లో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చినవారికే ఈ కరోనా ఎఫెక్ట్ ఉంటుందని.. దేశంలో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యాధికారులు తెలుపుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: