తెలంగాణ‌ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ 2020-21 ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బ‌డ్జెట్ సంక్షేమ బ‌డ్జెట్‌గా నిలిచింద‌ని ప‌లువురు నిపుణులు అంటున్నారు. నిజానికి తెలంగాణ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి కూడా సంక్షేమ రంగానికి పెద్ద‌పీట వేస్తోంది. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫ‌లాలు అందించ‌డంలో సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో రెండో సారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఆ సంక్షేమ ప‌థ‌కాలే సీఎం కేసీఆర్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చాయ‌ని చెప్పొచ్చు అందుకే అప్పులు పెరిగిపోతున్నా.. సంక్షేమ ప‌థ‌కాల‌కు ఎక్క‌డ కూడా ఆటంకాలు లేకుండా ఆయ‌న అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.



తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన వార్షిక బ‌డ్జెట్‌లో కూడా సంక్షేమ రంగానికి పెద్ద‌మొత్తంలో నిధులు ప్ర‌తిపాదించారు. ఇందులోప్ర‌ధానంగా ఆస‌రా పింఛ‌న్ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఆస‌రా పింఛ‌న్లు పొందుతున్న వారిలో సుమారు అన్నిసామాజిక‌వ‌ర్గాల వారు ఉన్నారు. బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, విక‌లాంగులు, గీత‌కార్మికులు.. ఇలా అనేవ‌ర్గాలు ఆస‌రా పింఛ‌న్ ప‌థ‌కం కింద ల‌బ్ధిపొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ ఈ వ‌ర్గాలు టీఆర్ఎస్‌కు అండ‌గా నిలుస్తున్నాయి. అందుకే ఎన్నిక‌లు ఏవైనా గులాబీ జెండానే రెప‌రెప‌లాడుతోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.



ఈ నేప‌థ్యంలోనే ఈ బ‌డ్జెట్‌లో సంక్షేమ‌రంగానికి ఆటంకం ఏర్ప‌డ‌కుండా నిధులు కేటాయించార‌ని చెబుతున్నారు. ఈ కేటాయింపుల‌పై ల‌బ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్. ఇక ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కొద్ది రోజులుగా దీనిని ప‌రిశీలిస్తున్న కేసీఆర్ ఇప్పుడు జ‌గ‌న్‌ను ఫాలో అవుతూ సంక్షేమం రంగానికి ఎక్కువ నిధులు కేటాయించ‌రు.



-ఆసరా పెన్షన్లకు రూ. 11,758 కోట్లు

-ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 16,534.97 కోట్లు

-ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 9,771.27 కోట్లు

-మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రూ. 1,518.06 కోట్లు

 

మరింత సమాచారం తెలుసుకోండి: