తన కూతుర్ని ఎంతో అల్లరి ముద్దుగా పెంచి పెద్దచేసిన మారుతీ రావు ఈరోజు తన కూతురి కారణంగానే చనిపోవడం ఎంతో బాధాకరమని తెలుగునాట ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వయసు రాకుండానే తండ్రి ని ఎదురించి ప్రేమ, పెళ్లి అంటూ తన కూతురు వేరే అబ్బాయితో వెళ్లిపోవడంతో పాపం ఆ తండ్రికి గుండె పగిలినంత పనేయ్యింది. బిడ్డ ఎవరితోనో వెళ్ళిపోతే ఒక్కసారిగా తన కుటుంబం పరువు మంటగాల్సిందని తాను కృంగిపోయాడు. గడపదాటి తండ్రి ని ఎదిరించి పెళ్లిచేసుకోవడమే పెద్ద ఘనకార్యంగా భావించిన అమృత తన తండ్రిని మరీంత బాధపెడుతూ ఫ్లెక్సీ లు, వీడియోలు, ఫోటోలతో రెచ్చగొట్టిందని, అలా కాకుండా పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్లి మంచిగా బతికితే ఇదంతా జరిగేది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.



ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, సంసారం చేయడం తెలుసు కానీ సురక్షితంగా ఎలా జీవించాలో కూడా తెలియని ఈమె ని చాలా మంది బాగా విమర్శిస్తున్నారు. తన భర్త ప్రణయ్ చనిపోవడానికి కూడా ఈమె తెలియనితనమేనని అనేవారు కోకోల్లలు. ఏ తండ్రి అయినా తన బిడ్డ విషయంలో మంచి జరగాలనే కోరుకుంటాడు. మారుతీ రావు కూడా అదే కోరుకున్నాడు. మంచిగా చదివించి ఒక గౌరవమైన జీవితాన్ని తన గారాలపట్టికి అందజేయాలని కలలు కన్నాడు. కానీ అమృత మాత్రం లవ్వాయణం నడుపుతూ తన ఆశలన్నీ వొమ్ము చేసింది. అతని గుండెని ముక్కలుముక్కలు చేసింది. నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితిని తెచ్చింది. తన కూతురు మళ్ళీ తన వద్దకు వస్తుందనే ఆశతో మారుతీ రావు చేసింది ముమ్మాటికీ తప్పే కానీ పరిస్థితులు, ఉద్వేగం అతడిని ఆ పని చేయించాయి. ఒకవేళ అమృత తన తండ్రి మాట వినట్లయితే ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రణయ్ బతికేవాడు అలానే అందరి కుటుంబాలు చాలా సంతోషముగా ఉండేవి. అయినా ఎన్ని అనుకోని ఏం లాభం. అటు ప్రణయ్ హత్యకు గురవ్వడం ఇటు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నాయి.




తాజాగా తన తండ్రి మరణం పై స్పందించింది అమృత. ఐతే ఆమె మాట్లాడిన విధానం చాలామందిని విస్తుపోయేలా చేస్తుంది. 20 ఏళ్ళ పాటు పెంచిన తండ్రి చనిపోతే కనీసం కంట తడి కూడా పెట్టుకోలేని అమృత లాంటి కఠినాత్మురాలిని మేమెక్కడా చూడలేదని చాలామంది అంటున్నారు. అలానే తన తండ్రి ని 'అతను' అని సంబోధించడం షాకింగ్ గా ఉందని మరికొందరు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: