ఈ మద్య చైనాకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.  ఓ వైపు కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మరో వైపు జన సష్టం ఘరంగా జరుగుతుంది. చైనాలో పుహాన్ లో వ్యాప్తి చెందిన ఈ కరోనా మహంమ్మారి ఇప్పుడు ప్రపంర వ్యాప్తంగా విస్తరించింది.  కరోనా వైరస్ కి చైనాలో మూడు వేల మందికి పైగా మరణించారు.. 80 వేల మందికి పైగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అసలే కరోనా ఎఫెక్ట్ తో వరుసగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో మరో ఘోరం జరిగింది.  చైనాలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ హోటల్ కూలిపోయింది. ఫూజియన్ ప్రావిన్స్ లోని క్వాంజౌ సిటీలో శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

 

దాదాపు 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. రక్షణ చర్యలు ప్రారంభించిన అధికారులు 34 మందిని సేవ్ చేశారు.  2018 జూన్‌లో ప్రారంభమైన ఈ హోటల్‌లో 80 గదులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఒక్కసారిగా కుప్పకూలడానికి కారణాలు తెలియాల్సి ఉంది. క్వారంటైన్ హోటల్ కూలిన విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.   కరోనా బాధితులకోసం ప్రైవేట్ భవనాలను కూడా క్వారంటైన్ సెంటర్లుగా ఏర్పాటు చేశారు.

 

కరోనా వైరస్ సోకిన వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి, కోలుకున్న తర్వాత వారిని ఇంటికి పంపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న చైనా క్యాబినెట్‌ ఎమర్జెన్సీ వర్కింగ్‌ టీమ్‌ సహాయ చర్యలను కొనసాగిస్తోంది. ఈ ప్రమాదం విషయం తెలుసుకొని ఇతర క్వారంటైన్ భవనాల్లో ఉన్న కరోనా బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద తాజా ఘటనతో చైనా పరిస్థితి మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లుగా ఉంది. చైనా కరోనా బారి నుంచి త్వరగా బయట పడాలని అంతర్జాతీయ సమాజం ప్రార్థిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: