సాధారణంగా మద్యం తాగితే ఏమవుతుంది...? ప్రాణం పోతుంది. ఒక్కసారే పోక పోయినా అనారోగ్యం బారిన పడి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మద్యపానం అనేది హానికరం. ఏ వైద్యుడు అయినా అదే చెప్తాడు. అందుకే చాలా మంది మద్యపానం వద్దని సూచిస్తూ ఉంటారు. అయినా సరే చాలా మందిలో మార్పు ఉండదు. కొంత మంది ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉంటారు. ఇది ప్రాణాలకు ప్రమాదం. ఏ విధంగా చూసినా సరే ఇది హానికరమే.  చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. 

 

కాని కొందరు వైద్యులు మాత్రం మద్యపానం వలన అనారోగ్యం పాలైన వ్యక్తికి మధ్యంతోనే వైద్యం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా 15 కేన్ల 15 కేన్ల బీరును ఆ మందుబాబు పొట్టలోకి పంప్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకెళ్తే.. వియత్నాంలోని క్వాంగ్త్రికి చెందిన గువన్ వాన్ నహత్ అనే వ్యక్తి బీరు కి బానిస అయిపోయాడు. బాబు రోజు తాగుడు పని మీదే ఉన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా సరే అతను మాత్రం మారలేదు. దీనితో అతడి శరీరంలో మిథనాల్ స్థాయి భయంకరంగా పెరిగిపోయింది. 

 

కాలేయం పూర్తిగా నాశనం అయింది. అతడిని బతికించడానికి చివరి ఉపాయంగా వైద్యులు 15 కేన్ల బీరును నహత్ పొట్టలోకి పంపింగ్ చేసారు. బీరుతో విషతుల్యమైన కడుపు లోని విషాన్ని బీరుతోనే తీసేయాలని ప్లాన్ చేసారు. కాని అది ప్రమాధకరమైనా సరే మరో మార్గం మాత్రం కనపడలేదు. దీనితో బీరులో మిథనాల్‌తోపాటు ఇథనాల్ కూడా ఉంటుంది కాబట్టి మిథనాల్ ద్వారా కడుపులో ఏర్పాడే యాసిడ్‌ను ఇథనాల్‌ నియంత్రి౦చే అవకాశం ఉంటుంది. డాక్టర్లు దానిపై నమ్మకం పెట్టుకుని పంప్ చేయగా అతను బతికాడు. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైద్యుల ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: