మ‌గ‌వారికి పెళ్ళైన త‌ర్వాత ఒక ప‌క్క త‌ల్లిని మ‌రోప‌క్క భార్య‌ని స‌మాన‌త్వంతో చూసుకోవ‌డ‌మ‌నేది చాలా పెద్ద ప‌రీక్ష‌. ఇదేం పెద్ద ప‌రీక్ష అని కొంత మంది అనుకుంటారు కానీ నీటి లోప‌ల ఉన్న‌వాళ్ళ‌కి తెలుస్తుంది లోతు ఎంత ఉంది అన్న‌ది. గ‌ట్టుమీద ఉన్న‌ళ్ళ‌కేం తెలుసు. అంటే పెళ్ళ‌యిన వాళ్ళ‌కి ఆ బాధ‌లు తెలుస్తాయి. ఇకే ఇంట్లో క‌లిసి ఉన్నా.. విడిగా ఉన్నా కూడా అత‌ను క‌న్న‌త‌ల్లికి, క‌ట్టుకున్న భార్య‌కి ఇద్ద‌రికి స‌మాన‌మైన ప్రేమ‌ను పంచాలి. ఏమాత్రం ఎక్క‌డ తేడా వ‌చ్చినా సున్నిత‌మైన ఆడ‌వారి మ‌నసు ఎంతో బాధ‌ప‌డుతుంది. అంటే చిన్న‌ప్ప‌టి నుంచి కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకునే త‌ల్లి ఒక వ‌య‌సు వ‌చ్చాక బిడ్డ‌లే చూసుకోవాలి. కాని ఆ బిడ్డ‌లు ఒక‌సారి పెళ్ళ‌యి భార్య‌లు వ‌చ్చాక వారి మాట‌ల‌కు విలువ ఇచ్చి క‌న్న త‌ల్లిన ప‌క్క‌న పెట్టిన ఎంతో మందిని మ‌నం ఈ రోజుల్లో చూస్తున్నాం.

 

అలాగే త‌ల్లి మాట‌కు ఎక్కువ విలువ ఇచ్చి భార్య‌ను లెక్క‌చేయ‌ని వాళ్ళ‌ను చూస్తూ ఉంటాం. క‌న్న‌త‌ల్లిదండ్రులను  ఒదులుకుని పెళ్ళ‌య్యాక సర్వ‌స్వం ఆయ‌నే అనుకుంటూ ప్రాణాల‌న్నీ క‌ట్టుకున్న భ‌ర్త మీద పెట్టుకుని వ‌చ్చే ఆడ‌వారు కూడా లేక‌పోలేదు. అలాంట‌ప్పుడు కొంత మంది త‌ల్లి మాట‌లు విని భార్య‌ను వేధిస్తుంటారు. అలాంటి వారు కూడా లేక‌పోలేదు. ఇక మ‌రి త‌ల్లి గొప్ప‌దా..భార్య గొప్ప‌దా అంటే ఇద్ద‌రూ మ‌న జీవితంలో కీల‌క పాత్ర పోషించేవారే అని చెప్పాలి. చిన్న‌ప్ప‌టినుంచి పాతికేళ్ళు వ‌చ్చే వ‌ర‌కు త‌ల్లి బిడ్డ‌ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ఆ త‌ర్వాత భార్య క‌ట్టుకున్నందుకు క‌డ‌వ‌ర‌కు తోడుంటుంది. కాబ‌ట్టి వారిద్ద‌రికి ఏవైనా చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఎవ్వ‌రిని ఎప్పుడూ ఎక్క‌డా త‌గ్గించ‌కుండా ప్రేమ‌తో వారిని అక్కున చేర్చుకుని అర్ధ‌మ‌య్యేలా చెపితే ఆ ప్రేమ అనేది ఇద్ద‌రికి ద‌క్కుతుంది.

 

అలాగే మ‌న జీవితంలో ఎప్పుడూ త‌ల్లిత‌క్కువ‌..భార్య త‌క్కువ అని ఉండ‌దు. ఇద్ద‌రిదీ కీల‌క పాత్ర‌నే. ఇక కాస్త వ‌య‌సు మ‌ళ్ళాక త‌ల్లి చూసుకోవ‌డానికి తండ్రి లేక‌పోతే ఆ త‌ల్లి ఆధార‌ప‌డేది త‌మ బిడ్డ‌ల‌పైనే అలాంట‌ప్పుడు ఆ త‌ల్లిని నిర్ల‌క్ష్యం చెయ్య‌కుండా జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డంలోనే త‌ల్లి బిడ్డ‌ల ప్రేమ తెలుస్తుంది. అలాగే ఆమె ఏ సుఖ‌దుఃఖాల‌ను పంచుకోవాలన్నా కూడా ఉన్నా కొడుకు కోడ‌లే ఆమెకు ఆశ‌రా కాబ‌ట్టి ఎప్పుడూ కూడా నిర్ల‌క్ష్యం వ‌హించ‌కూడ‌దు. అలాగే భార్య అంద‌రినీ వ‌దిలి నీ వెంట వ‌స్తుంది కాబ‌ట్టి ఆమెను అత్యంత ప్రేమ‌గా చూసుకోవ‌ల‌సిన బాధ్య‌త కూడా భ‌ర్త‌దే ఉంటుంది. భార్య‌లు భ‌ర్త నుంచి కోరుకునేది ప్రేమ ఆప్యాయ‌త అవి లేక‌పోతే ఇక వారి బ్ర‌తికి ఎందుకు అని అనుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. ఇక ఈ రెండు రిలేష‌న్స్‌ని చాలా జాగ్ర‌త్త‌గా మ్యానేజ్ చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీ అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: