తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమితులయ్యారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోవసారి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు.  నేడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవ త్సరానికి రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేశారు.  ఈ బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేశారు. 

 

రైతులకు రుణ మాఫీ విషయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణాలకు సంబంధించిన సొమ్మును నేరుగా బ్యాంకులకు చెల్లించకుండా రైతులకే చెక్కుల రూపంలో అందజేయాలని నిర్ణయించింది. రైతుల రుణ మాఫీ కోసం బడ్జెట్ లో రూ.6,225 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. రూ.25 వేల లోపు రుణాలు ఉన్న రైతులు 5,83,916 మంది ఉన్నారని, వారందరికీ పూర్తి సొమ్మును ఒకేసారి అందజేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.  ఇందుకోసం ఈ నెలలోనే రూ.1,198 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు.  అంతే కాదు హైదరాబాద్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ. 50 వేల కోట్లు అవసరమని గుర్తించామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

 

అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.  హైదరాబాద్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ. 50 వేల కోట్లు అవసరమని గుర్తించాం. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లు కేటాయించాం.  అంతే కాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ. 3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి ఇవ్వనున్నాం. వాటి వినియోగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిధుల కోసం మొత్తంగా రూ. 480 కోట్లను బడ్జెట్ లో కేటాయిస్తున్నాం.. అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: