గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావుపై ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు.  తమ కులం వాడని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న మారుతీరావు కూతురు అమృతపై కోపంతో ఆమె గర్భిణి అని తెలిసి కూడా ఆమె భర్తను ఓ క్రిమినల్ కి సుపారీ ఇచ్చి చంపించాడు.  తన కళ్ల ముందే భర్త మరణించడం తో విల విలలాడింది అమృత.  ఇటీవల అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  అయితే ఈ మద్య బెయిల్ పై వచ్చారు మారుతీరావు.  వారం రోజుల క్రితం ఆయన ఇంటి పెరట్లో ఓ మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. 

 

ఇదిలా ఉండగా ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాదులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం సృష్టించింది.  ఈ మధ్యాహ్నం మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మారుతీరావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలిందని చెప్పారు.  మారుతీరావు మృత దేహాన్ని చూసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన క్లూస్ టీమ్ ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్ లో తనిఖీలు నిర్వహించాయని, మారుతీరావు బెడ్ పై విగతజీవిగా పడివున్నాడని వెల్లడించారు.

 

కాగా, ఆయన మృత దేహం వద్ద ఓ లెటర్ ఉందని.. అందులో అమృతా, అమ్మ దగ్గరికి వచ్చేయమ్మా... గిరిజా నన్ను క్షమించు అనే వాక్యాలు ఉన్నాయని సీఐ పేర్కొన్నారు.  మరణించడానికి ముందు ఆయన తీవ్ర వత్తిడికి లోనయ్యారట..  బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన మానసికంగా చాాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.  తాజాగా మారుతీరావు మరణంపై స్పందించిన అమృత ఈ విషయం గురించి తనకు ఏమీ తెలియదని..  వార్త  మీడియాలో చూసిన తర్వాతే తెలిసిందని అన్నారు.  మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆయన కుటుంబీకులకు అందజేయగా, వారు స్వస్థలం మిర్యాలగూడ తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: