చైనాలో ప్రబలిన కరోనా వైరస్ వల్ల అక్కడ ఇప్పటికీ అక్కడ 3 వేల మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.  చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ఇటలీలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉత్తర ఇటలీలో కరోనా ఎఫెక్ట్ బీభత్సంగా పడుతుంది.   ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాదాపు 1.6 కోట్ల మంది ప్రజలను క్వారెంటైన్‌లో ఉంచింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి జనాలు భయపడిపోతున్నారు.  పాఠశాలలతో పాటు జిమ్‌లు, స్కై రిసార్టులు, పబ్లిక్‌, ప్రైవేటు స్థలాల్లో పంక్షన్లు వంటి వాటిపై నిషేధం విధించింది.  అంతే కాదు అక్కడ టూరిజం పై కూడా ఆంక్షలు విధించారు.   లాంబార్డీతో పాటు మరో 14 మధ్య, ఉత్తర ప్రావిన్స్‌ ప్రజలు బయటకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవడం తప్పనిసరని తెలిపింది. 

 

ఏప్రిల్‌ 3 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 230కి చేరింది.  ఇదిలా ఉంటే భారత్ లో కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల భారత్ లో కూడా కొన్ని చోట్ల టూరీజంపై కూడా ఎఫెక్ట్ పడుతుంది.  అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తమ రాష్ట్రంలోకి విదేశీయుల రాకను నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొటెక్టెడ్‌ ఏరియా పర్మిట్స్‌ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పీఏపీ ఇష్యూయింగ్‌ అథారిటీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ ఆదేశాలిచ్చారు. 

 

 ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, కేరళా, ఢిల్లీలో, కాశ్మీర్ లో కొన్ని కేసులు నమోదు అయ్యాయి. దాంతో విదేశీ పర్యాలకులపై కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు.  ఇక ఎక్కువగా జనాలు ఉండే ప్రదేశాలు, థియేటర్లు , మాల్స్  ఇతర ప్రదేశాలు కట్టడి చేస్తున్నారు.   విదేశాల నుంచి టూర్‌కు వచ్చిన వారి నుంచి ఈ వైరస్‌ వ్యాప్తిస్తోంది. అందుకే అరుణాచల్‌ ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాం. తాత్కాలికంగా పీఏపీను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం  అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: