కళ్ళు తెరచినప్పటి నుండి వినపడే వార్తలు రోడ్డు ప్రమాదా ల్లో దుర్మణం అని.. అతి వేగం, మద్యం సేవించి వాహనాల ను నడుపుతూ చాలా అంన్డి రోడ్డు ప్రమాదాలకు గురవుతూ చని పోతుంటారు. ఇటీవల గుంటూరు లో జరిగిన భారీ రోడ్డు ప్రమాదం మరువక ముందే మరొక ప్రమాదం జరిగింది. గొర్రెల లోడుతో వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయారు. 

 

 


వివరాల్లో కి వెళితే.. గొర్రెల లోడు తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడం తో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్‌ కు గొర్రెల లోడు తో వెళ్తున్న డీసీఎం లారీ మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది.. అతి వేగం గా వస్తున్నా లారీ ఎదురుగా వస్తున్నవ్యాన్ ను తప్పించబోయి వంతెనపై నుండి కిందకు పడింది.. 

 

 

 


అయితే వంతెన మీదుగా వెళ్తున్న లారీ ప్రమాదవ శాత్తు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లినర్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ లో ఉన్న కొన్ని గొర్రెలు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. 20 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కళేబరాలతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఎదురుగా వస్తున్నా వ్యాన్ ను తప్పించబోయి బోల్తా కొట్టిందని సమాచారం. 

 

 

 

వంతెనపై ఈ భారీ ప్రమాదం జరగడంతో.. చాలా సేపు జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి మిగిలిన గొర్రెలను వేరే వాహనంలో తరలించారు.మృతదేహాలను మహబూబ్ నగర్ జడ్చర్లలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: