మాన్సాస్ చైర్ పర్సన్ సంచైత వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పని తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కి రెడీ అవుతున్నారు. కావాలని వైయస్ జగన్ ప్రభుత్వం కక్షగట్టి మరియు నాపై వ్యవహరిస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా హిందూ దేవాలయాలకు సంబంధించిన విషయాలలో అన్యమతస్తులకు పదవులు కేటాయించడం ఏంటి అంటూ అన్నట్టుగా అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో సంచైత.. బాబాయ్ అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు. నా మతం హిందూ మతం, నేను పుట్టుకతో హిందువుని నా గురించి సొంత బాబాయ్ ఇలా మాట్లాడటం చూస్తుంటే చాలా బాధేస్తోంది అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

వాటికన్ సిటీకి వెళ్లి నేను ఫొటో దిగితే క్రిస్టియన్ అవుతానా..? అంటూ ఆమె ప్రశ్నించారు. ఎన్ని విమర్శలు చేసినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను… నా పని తీరు చూసి మాట్లాడాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నా మతం పై అనవసరమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సంచైత అన్నారు. మా తాతగారు వారసత్వాన్ని కొనసాగించడానికి నాకు హక్కు ఉందని సంచైత తెలిపారు.

 

అంతేకాకుండా మహిళ సమస్యల విషయంలో చాలా అవగాహన ఉందని పేర్కొన్నారు. అంతగా సంచైత ఈ పదవిని పట్టుకుని ఏడుపు వెనకాల ఏం జరిగింది అన్న దానిలో మాత్రం బయటకు వచ్చిన విషయం ఏమిటంటే కచ్చితంగా ఈ ట్రస్టు ద్వారా సమాజంలో ఉన్న మహిళలకు సేవ చేయాలనే భావనలో సంచైత ఉన్నట్లు కరాఖండిగా చెప్పింది. ఒక పక్క ఆమె వైసిపి పార్టీ గేమ్ ప్లాన్ లో బాధితురాలు అనే టాక్ వినబడుతోంది. మరో పక్క మాత్రం సొంత కుటుంబ సభ్యులని ఆమె బాధపెడుతుంది అని ఆమె సన్నిహితులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: