స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబునాయుడు మైండ్ బ్లాంక్ అయిపోయిందనే చెప్పాలి. బిసిలకున్న 34 శాతం రిజర్వేషన్ ను అమలు కానీయకుండా చంద్రబాబు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ పై బురద చల్లటానికి చంద్రబాబు హైకోర్టును అడ్డుగా పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబు కుట్రను జగన్ తెలివిగా తిప్పి కొట్టేటప్పటికి ఏమి చేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయాడు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే బిసిల రిజర్వేషన్ 24 శాతానికి మించకూడదని కోర్టు చెప్పింది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటిస్తునే పార్టీ పరంగా బిసిలకు 34 శాతంకన్నా ఎక్కువ స్ధానాలే కేటాయించాలని  డిసైడ్ చేశాడు. అంటే ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వుడు స్ధానాలు పోగా మిగిలినవి జనరల్, జనరల్ మహిళా స్ధానాలుంటాయి. ఇలాంటి చోట్ల కూడా బిసిలకే ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించాడు. జగన్ తాజా నిర్ణయంతో ఒక విధంగా చూస్తే 34 శాతానికన్నా మించే బిసిలకు దక్కుతుంది.

 

జగన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడని చంద్రబాబు కానీ టిడిపి నేతలు కానీ ఏమాత్రం ఊహించలేదు. ఎప్పుడైతే జగన్ తీసుకున్న నిర్ణయం బయటకు వచ్చిందో ఏమి చేయాలో చంద్రబాబుకు తోచటం లేదు.  17 మున్సిపల్ కార్పొరేషన్లలో అన్నీ రిజర్వేషన్లు పోను జనరల్, జనరల్ మహిళకు రిజర్వయిన కార్పొరేషన్లు ఎనిమిదున్నాయి. అంటే వీటిల్లో కూడా వీలైనన్ని బిసిలకే మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు అయ్యుండచ్చు కేటాయించాలని డిసైడ్ అయ్యాడు జగన్.

 

అలాగే  13 జిల్లా పరిషత్తులలో కూడా ఏడు స్ధానాలను మహిళలకు కేటాయించారు. మళ్ళీ ఇందులో కూడా మెజారిటి బిసిలకే కేటాయించాలని పార్టీ నేతలకు జగన్ ఆదేశాలిచ్చాడు. ఇవే ఇలాగుంటే ఇక జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచు స్ధానాల్లో కూడా బిసిలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడు.  అంటే 34 శాతం బిసిల రిజర్వేషన్ల అమలులో న్యాయస్ధానం పరంగా ఎదురైన అడ్డంకులను జగన్ పార్టీ పరంగా  అధిగమించాలని డిసైడ్ అవ్వటం సంచలనమనే చెప్పాలి. నిజానికి కోర్టు తీర్పును అమలు చేసినా జగన్ ను ప్రశ్నించే వాళ్ళుండరు. అలాంటిది పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయంతో బిసిలకు న్యాయం చేయబోతున్నాడని తెలియటంతోనే చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: