రాయలసీమ జిల్లాల్లో వైసీపీ హవా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సీమలోని నాలుగు జిల్లాలతో పాటు, వాటి పక్కనే ఉండే నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగుండదు. వైసీపీ అధికారంలో లేని 2014లోనే ఈ జిల్లాల్లో వైసీపీ డామినేషన్ ఉంది. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. టీడీపీ కేవలం అనంతపురంలో 2, చిత్తూరులో ఒక సీటు గెలుచుకోగా, మిగతా మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.

 

ఈ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం జిల్లాలో కూడా వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీమలో వైసీపీ హవా తప్పనిసరిగా ఉంటుంది. ఇక సీమ జిల్లాలకు ఏ మాత్రం తగ్గకుండా తమ సత్తా ఏంటో చూపించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ రెడీగా ఉన్నారు. విజయనగరంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స, సీమ జిల్లాలకు పోటీగా, తమ జిల్లాలో వైసీపీకి మెజారిటీ సీట్లు దక్కేలా ప్లాన్ చేస్తున్నారు.

 

జిల్లాలో ఎలాగో 9 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులే ఉన్నారు..కాబట్టి మెజారిటీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, పంచాయితీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. ముఖ్యంగా జెడ్పీ పీఠం, విజయనగరం కార్పొరేషన్‌ని దక్కించుకుంటే బొత్సకు తిరుగుండదు. కాబట్టి ఆయన మెయిన్ ఫోకస్ వాటి మీద పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ జిల్లాలో టీడీపీ నేతలు పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం బొత్సకు కలిసొచ్చే అంశం. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు పెద్దగా అడ్రెస్ లేరు.

 

అటు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతి రాజుకు ఆరోగ్యం బాగోలేదు. పైగా ఆయన ఫ్యామిలీ గొడవల్లో మునిగి ఉన్నారు. అటు మాజీ మంత్రి సుజయకృష్ణరంగరావు కూడా పెద్దగా పార్టీ కోసం కష్టపడుతున్నట్లు కనబడటం లేదు. ఇక ఈ పరిణామాలని బట్టి చూస్తే జిల్లాలో వైసీపీ వన్‌సైడ్‌గా విజయం సాధించడం ఖాయం. ముఖ్యంగా జెడ్పీ పీఠం, కార్పొరేషన్‌లో వైసీపీ గెలవడం పక్కా.   

మరింత సమాచారం తెలుసుకోండి: