శక్తి కి సామర్ధ్యానికి వయసుతో పనిలేదని నిరూపించాడు 103 ఏళ్ల ఇండోనేషియా కు చెందిన పుఅంగ్ కట్టే. సొంత పనులకు కూడా ఎవరోకరి మీద ఆధారపడే ఈ ముసలి వయసులో అంతలా ఎంచేసాడు అనుకుంటున్నారా..! 27 యేళ్ళ అలంగ్ అనే అమ్మాయిని ప్రేమించి తన బిడ్డకు తల్లిని కూడా చేశాడు పుఆంగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. 27 ఏళ్ల అమ్మాయి 103 ఏళ్ల వ్యక్తితో ప్రేమతో పడటం ఏంటి అనుకుంటున్నారా. అయితే వినండి. 

 

ఇండో అలంగ్ కు అంతకు ముందు తన బాయ్‌ఫ్రెండ్‌ గొడవపడి విడిపోయారు. ఆ సమయంలో ఆమె తన బాధను పొరుగునే ఉన్న పుఆంగ్‌తో పంచుకుంది. ఆ టైంలో పుఆంగ్ చూపిన ఆప్యాయతకు మురిసిపోయిన అయిన అలంగ్ అతనితో ప్రేమలో పడింది. ఆ సమయంలో ఇద్దరూ శారిరకంగా  ఏకమయ్యారు. తర్వాత కొద్ది రోజుల కు ఆమె గర్భవతి అని తెలియగానే 103 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నందుకు పుఆంగ్ సంతోషానికి హద్దులేవు. వెంటనే ఇద్దరు పెళ్లిచేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. 

 

పెళ్లిలో వరుడు పుఅంగ్ కన్యాశుల్కం కింద 25 వేల రూపాయల నగదుతో పాటు ఒక బంగారు ఉంగరం కూడా ఇచ్చాడట. ఒకప్పుడు ఈ పుఆంగ్ 1945 ఇండోనేషియా యుద్ధం సమయంలో మిలిటరీ కర్నల్‌గా భాద్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పలువురు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ముసలోడే గాని గట్టోడు అని... ముని మనువరాలికే మనువరాలికి కడుపు చేసాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అతను చనిపోతే ఆమె మరో పెళ్లి చేసుకోకూడదు అని కొందరు అంటూ అలా చేసుకుంటే ఆమె రికార్డ్ పోతుంది అంటూ మరికొందరు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ వయసు లో ముసలాయన చేసిన పని మాత్రం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: