మంత్రులకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు అధినేత జగన్ నుంచి వస్తున్నాయి. అవి అలాంటి ఇలాంటి వార్నింగ్ లు అయితే కాదు. చాలా సీరియస్ వార్నింగ్ లు. స్థానిక సంస్థల ఎన్నికలకు, మంత్రి పదవులకు జగన్ లింక్ పెట్టేసారు. మంత్రుల నియోజకవర్గాలతో పాటు వారు ఇంచార్జిలుగా ఉన్న జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వారే  బాధ్యత వహించాలసిందిగా జగన్ గట్టిగానే హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మంత్రుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అయినా మట్టికరిపించి తమ సత్తా మరోసారి చాటాలని దృఢ నిశ్చయంతో మంత్రులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికార వైసీపీకి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్ గా మారబోతున్నాయి. 

 

కేవలం పది నెలల్లోనే ఎన్నికలను ఎదుర్కొనాల్సి వస్తుండటంతో ఫలితాలు అనుకూలంగా రాకపోతే దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని జగన్ పదే పదే పార్టీ శ్రేణులకు సూచిస్తున్నాడు.అందుకే వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతను ఆ జిల్లాకు చెందిన మంత్రులకు అప్పగించారు. ఇంచార్జి మంత్రులకు కూడా టార్గెట్ పెట్టారు. ప్రతి మంత్రికి సంబంధించిన పనితీరు నివేదిక తన దగ్గర అందుబాటులో ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో విఫలమయితే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరికలు చేయడంతో మంత్రులు, ఎమ్యెల్యేల్లో వణుకు మొదలయినట్టు కనిపిస్తోంది.


తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని జగన్ నమ్ముతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, సంక్షేమ పథకాలను ప్రజలు వద్దకు తీసుకెళ్లాలనే కాస్త ఆగ్రహం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ పై ప్రజలలో పూర్తిగా సానుకూల దృక్పధం ఉందని, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం లేదని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇక టీడీపీ గట్టిగా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో జగన్ సీరియస్ వార్నింగ్ లు ఇస్తున్నారు. జగన్ చెప్పినట్టుగానే ఫలితాల్లో కనుక ఏమైనా తేడాలు వస్తే మంత్రి పదవులనుంచి కూడా తప్పించేందుకు జగన్ వెనకాడేలా కనిపించడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: