తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం మరోసారి సవతితల్లి ప్రేమను ప్రదర్శించింది . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను విభజిస్తూ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సందర్బంగా రెండు రాష్ట్రాల్లోను  నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సంఖ్యను పెంచాలని నిర్ణయించింది . ఈ మేరకు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని స్పష్టంగా పేర్కొనడం జరిగింది . ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి అటు తెలంగాణ , ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువెళ్లాయి . కానీ కేంద్రం మాత్రం, ఎపుడు సానుకూలంగా  స్పందించలేదు .

 

తెలంగాణలో 119 నియోజకవర్గాలను 153 కు పెంచాలని , ఆంధ్ర ప్రదేశ్ లో 175  నియోజకవర్గాలను 225 పెంచాలని పలుమార్లు రెండు రాష్ట్రాలు   కేంద్రానికి నివేదించిన ఫలితం లేకుండా పోయింది . అయితే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించని కేంద్రం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం నియోజకవర్గాల పునర్విభజనకు ఒకే చెబుతూ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది . అరుణాచల్ ప్రదేశ్, అసోం , మణిపూర్ , నాగాలాండ్ లతో పాటు జమ్మూ కాశ్మీర్ లలో నియోజకవర్గాల పునర్విభజనకు ఈ కమిషన్ పని చేయనుంది . అయితే పునర్విభజన చట్టంలోనే పేర్కొన్నప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణను విస్మరించి కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే నియోజకవర్గాల పునర్విభజనకు కమిషన్ ఏర్పాటు చేయడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ఎంతటి వివక్ష చూపిస్తుందో ఇట్టే అర్ధమవుతుందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. 

 

గతం లో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని  ఏపీ ముఖ్యమంత్రి హోదా లో  చంద్రబాబు పలుమార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం లేకుండా పోయింది . ఇక కేసీఆర్ కూడా ఇదే విషయమై మోడీ సర్కార్ కు విన్నవించినా లాభం లేకుండా పోయింది . ఇలా ముఖ్యమంత్రులు చెప్పినా కూడా మోడీ సర్కార్ , విభజన చట్టం హామీలఅమలుకు ఆసక్తి చూపడం లేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: