ఏదేమైనా త‌న వాడు అయితే.. కంపు ఇంపుగా ఉంటుంద‌ని, త‌న‌వాడు కాన‌ప్పుడే విష‌యం బ‌య‌ట‌ప‌డుతుం ద‌ని అంటారు! ఇప్పుడు టీడీపీ విష‌యంలోనూ అదే జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో తిరుమ‌ల తిరుప‌తి బోర్డు చైర్మ‌న్ గా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పేరు తెర‌మీదికి రాగానే .. సోష‌ల్ మీడియా.. గ‌తంలో ఆయ‌న చ‌ర్చి ల్లో పాల్గొన్న‌ప్పుడు.. ప్రార్ధ‌న‌లు చేసిన‌ప్పుడు తీసిన ఫొటోలు, వీడియోల‌ను తెర‌మీదికి తెచ్చి హ‌డావుడి చే సింది అయితే, దానిపై టీడీపీ నేత‌లు అధినేత చంద్ర‌బాబు స‌హా అంద‌రూ గుంభ‌నంగా ఉన్నారు.  అయినా కూడా కొన్నాళ్లకు టీటీడీ బోర్డు చైర్మ‌న్ గిరీని పుట్టాకే ఇచ్చారు. స‌రే.. ప్ర‌భుత్వం మార‌క‌.. పుట్టానే కొన్నాళ్ల‌కు కాదు కూడ‌ద‌ని అంటూ త‌ప్పుకున్నార‌నుకోండి!



అయితే, ఇప్పుడు తెర‌మీదికి మాన్సాస్ వ్య‌వ‌హారం వ్య‌వ‌హారం వ‌చ్చింది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌న‌గ రం మాజీ ఎంపీఅశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా ఉన్న ఈ సంస్థ నిజానికి వారి కుటుంబ సంస్థే. అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ సంస్థ‌కు చైర్మ‌న్‌గా ఉన్న అశోక్‌ను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఆయ‌న అన్న కు మార్తె సంచైత‌ను నియ‌మించింది. ప్ర‌స్తుతం సంచైత బీజేపీలో ఉన్నారు. పైగా ఈ నియామ‌కానికి సంబంధిం చిన జీవోను ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి విడుద‌ల చేయ‌డంతో విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ఛాన్స్ ఇచ్చిన‌ట్ట‌యింది. స‌రే! ఇదిలావుంటే, సంచైత నియామ‌కంపై సొంత బాబాయి..తో కుటుంబం అంతా తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.



ఇదే స‌మ‌యంలోటీడీపీ అనుకూల మీడియా.. కొన్ని ఫొటోల‌ను ప్ర‌చురించి.. సంచైత‌ను మాన‌సికంగా దెబ్బ‌కొట్టే కార్య‌క్ర‌మానికి తెర‌దీసింద‌ని అంటున్నారు. రెండు కీల‌క అంశాల‌పై టీడీపీ అనుకూల వ‌ర్గాలు చేస్తున్న ప్ర‌చారం వారికే బూమ‌రాంగ్ మాదిరిగా తిప్పికొడుతున్నాయ‌నే ప్ర‌చారం కూడా ఉంది. వీటిలో ఒక‌టి.. వంశ‌పారంప‌ర్యంగా పురుషుల‌కే ద‌క్కాల్సిన ఈ పీఠాన్ని.. జ‌గ‌న్ ఉద్దేశ పూర్వ‌కంగా సంచైత‌కు అప్ప గించారంటూ.. అశోక్‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గంప్ర‌చారం చేస్తోంది. అయితే, అన్నింటా అవ‌కాశాల‌ను అందిపు చ్చుకుంటున్న మ‌హిళ‌లు దీనికి ఎలా అన‌ర్హులు అవుతారో వారే చెప్పాలి... అంటున్నారు సంచైత ను సమర్ధించేవారు.  



ఇక‌, సంచైత వాటిక‌న్‌కు వెళ్లి ప్రార్థ‌న‌లు చేసింద‌ని, ఆమె త‌ల్లి ఉమ కేక్ క‌ట్ చేసి జ‌న్మ‌దిన వేడుక‌లు చేసుకున్నార‌ని, క్రిస్ట‌మ‌స్‌ను నిర్వ‌హించుకున్నార‌ని సో.. ఇలాంటి వారుసింహాచ‌లం దేవ‌స్తానం బోర్డు చైర్మ‌న్ గా ఎలా ప‌నికి వ‌స్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి గ‌తంలో పుట్టాకు టీటీడీ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చిన‌ప్పుడు ఈ గొంతులు ఏమ‌య్యాయ‌నేది సంచైత త‌ర‌ఫున వారి వాద‌న‌! నిజ‌మే క‌దా.. ఇప్పుడు టీడీపీ నేత‌లు అడ్డంగా దొరికిపోయారుగా అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఇది ఒక కుటుంబానికి-ఒక ప్ర‌భుత్వానికి సంబంధించిన వ్య‌వ‌హారం. చైర్మ‌న్‌ల‌ను నియ‌మించే అధికారం ప్ర‌బుత్వానికి ఉంటుంది. అయితే, ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం భూముల‌పై క‌న్నేశార‌ని, అందుకేబీజేపీకి చెందిన సంచైత ను ఇలా వాడుకుంటున్నార‌నే ప్ర‌చారం స‌రైంది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: