నవంబర్ నెలలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు అగ్నిపరీక్ష కానున్నాయి. జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలో ఉన్న జేడీయూ మరియు బిజెపి పార్టీ లకు అతి కీలకం. అదే సందర్భంలో విపక్షాలు లో ఉన్న prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి మరియు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు కీలకమే. కేంద్రంలో జాతీయ పార్టీలు అయినా కాంగ్రెస్ మరియు బీజేపీలు బీహార్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి రాజకీయాలు చేస్తున్నాయి. 2015 వ సంవత్సరం లోనే అధికారం చేపడతామని అనుకున్న బీజేపీకి 54 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలను గెలుచుకుంది.

 

ప్రస్తుతం దేశంలో ఇటీవల జరిగిన మహారాష్ట్ర , ‍హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు చూడటం జరిగింది. దీంతో దేశంలో బీజేపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నేపధ్యంలో నవంబర్ లో జరగబోయే బీహార్ ఎన్నికలలో మోడీ అద్భుతమైన వ్యూహం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే జెడియు పార్టీ నుండి బయటకు వచ్చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో మరో పార్టీ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బిజెపి పార్టీ ని నవంబర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో సింగల్ గా దింపాలని ఆలోచిస్తున్నారట.

 

మ్యాటర్ ఏమిటంటే జేడీయూ అధినేత నితీష్ కుమార్...ప్రశాంతి కిషోర్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం..అతని వాడుకునే బీజేపీని అసెంబ్లీ ఎన్నికలలో సింగిల్ గా దింపి గెలవాలని మోడీ వ్యూహం పన్నినట్లు జాతీయ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మరి సింగిల్ గా బిజెపి ఎన్ని స్థానాలు గెలుస్తుందో చూడాలి. ప్రశాంతి కిషోర్ ఆధ్వర్యంలో పార్టీ వస్తే కచ్చితంగా ఓటు ఛీలాటం గ్యారెంటీ. దాంతో బిజెపికి బెనిఫిట్ అవుతుందని మోడీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా ఈ విధంగానే బిజెపి నీ పోటీ చేయించాలని మోడీ ఆలోచిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: