తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడ్డ వర్గాలకు (బీసీ) అధిక శాతం రిజర్వేషన్లు ఇవ్వనీయకుండా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కోర్టు కేసులు వేయించి అడ్డుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత 'సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి నేడు ఆరోపించారు. నేడు ఆయన వరుస పెట్టి ట్వీట్లు చేశారు. అందరికి సామాజిక న్యాయం చేసేలా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని సజ్జల ఈ ముఖంగా ట్వీట్ చేశారు. 

 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి న్యాయపరమైన అంశాలతో ఎటువంటి సంబంధం లేకుండా పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు పది శాతం సీట్లు కేటాయించి తన మీదున్న నమ్మకాన్ని చాటుకున్నారని ఆయన తెలిపారు. దీనితో బీసీలకు వైస్సార్సీపీ 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిందని సజ్జల తేలిపారు. అంతేకాకుండా టీడీపీకి కూడా తమలాగే బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తారా అని ఆయన సవాల్ విసిరారు. 

 

 

రాష్ట్రంలో  ప్రధానంగా బీసీలు ఉన్నారని అందుకే 34 శాతం సీట్లు కేటాయించి బీసీలకు ప్రాతినిథ్యం పెంచాలని ఆయన ఈ ముఖంగా అడిగారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సీఎం జగన్ ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా స్థానిక ఎన్నికలు జరిపామని సజ్జల తెలిపారు. అయినా వైఎస్సార్సీపీ బలంగా ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. 

 

IHG

 

డబ్బు, మద్యం లాంటి వాటి ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరిపితే, తమకే మేలని ఏ ప్రతిపక్షమైనా అనుకుంటుందని సజ్జల ఈ ముఖంగా తెలియచేసారు. అక్రమాలు లేకుండా స్థానిక ఎన్నికల కోసం సీఎం జగన్ గట్టి ఏర్పాట్లు చేస్తుంటే చంద్రబాబు మాత్రం తమను ఓడించడానికేనంటూ వింత వాదన చేస్తున్నారని ఆయన ఒక విధమైన ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: