ఈ నగరానికి ఏమైందో తెలియదు గాని.. ఇక్కడ బ్రతికే వారి జీవితాలకు భద్రత లేదని పలు సందర్భాల్లో నిరూపించ బడుతుంది.. ఇప్పటికే ఒక వైపు కరోనా భయం వెంటాడుతుండగా, మరో వైపు రోడ్దెక్కాలంటే ఎవడు వచ్చి యాక్సిడెంట్ చేస్తాడో అని భయం.. ఇదే కాకుండా పాత పగలుంటే ఎవడు వచ్చి కత్తులతో దాడి చేస్తాడో అని భయంతో వెళ్లుతుండగా, సైకో గాడిద కొడుకులు ఏ పగ లేకుండానే విచక్షణ రహితంగా చచ్చేలా చావబాదుతున్నారు..

 

 

ఇంకా ఇలాంటి బాధలు ఎన్నని చెప్పాలో అర్ధం కావడం లేదు.. దొంగలని, రౌడీలని, తాగుబోతులని ఇలా అనేక రకాల సమస్యలతో నగర బ్రతుకులు సతమతం అవుతుంటాయి.. నిత్యం ఏదో ఒక సమస్య.. ఎక్కడో ఒక్క చోట దారుణం. ఎవడో ఒకడు మోసం చేయడం.. అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు పోవడం.. ఇన్ని సమస్యలు ఫ్రీ వైఫైలా మనచుట్టు పెట్టుకుని ఇక్కడ బ్రతకడం అవసరమా.. అని అంటే తప్పదుకదా బ్రదర్ బ్రతుకుదెరువు ఇక్కడే ఉంది.. ఇక్కడ మంచి మంచి కంపెనీలు ఉన్నాయి.. అన్ని వసతులు, సౌకర్యాలు ఇక్కడే లభిస్తుండగా ఆ పల్లెటూళ్లో వెళ్లి ఏం చేసుకుని బ్రతకమంటారు అని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు..

 

 

మీరు చెప్పేది నిజమే కావచ్చూ.. కానీ సొంత ఊళ్లో ప్రాణాలకు భద్రత ఉంటుంది.. కానీ మనది కాని ఊర్లో మన ప్రాణాలకే కాదు, మనకుటుంబ సభ్యుల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు.. ఎవడు ఉగ్రవాది రూపంలో వచ్చి ఎక్కడ బాంబ్ పేల్చుతాడో తెలియదు.. నరహంతకులు కూడా మన చుట్టే తిరుగుతుంటారు.. నల్లికుట్ల నాయల్లు మనపక్కనే ఉండి గోతులు తీస్తున్న గుర్తించలేం.. అంతెందుకు మన అక్కనో, చెల్లెలో, తల్లో, భార్యనో ఇంట్లోనుండి బయటకు వెళ్లితే తిరిగి క్షేమంగా ఇల్లు చేరుకునే వరకు భయమే.. వారి మెడలో బంగారం ఉంటే ఇంకా గుండెదడ పెంచుకోవలసిందే..

 

 

ఇన్ని కష్టాల మధ్య కేవలం పట్నంలో బ్రతుకుతున్నాం అని మురవడం తప్పితే ఏమైనా ఉన్నదా.. నిత్యం కాలకూట విషవాయువుల మధ్య చిక్కుకుని, కాలుష్యాల కొరల్లో చావలేక బ్రతకడం ఎందుకు బ్రదర్.. ఇదిగో నేనైతే ఒక మంచి విషయం చెప్పాలనుకున్నా చెప్పా.. ఆ తర్వాత మీ యిష్టం.. ఇందులో బలవంతం ఏం లేదు అని అనుకుంటున్నారట మంచి కోసం ఆలోచించే మనుషులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: