తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య గురించి తెలియని వారుండరు. అప్పట్లో ప్రణయ్ అమృతల కులాంతర వివాహం చేసుకోవడంతో కక్ష కట్టిన అమృత తల్లి మారుతీ రావు ప్రణయ్ హత్య చేయించడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ప్రణయ్ హత్య తర్వాత మారుతీ రావు కు.. జైలు శిక్ష కూడా పడింది. అయితే తాజాగా ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రావు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం మరో సారి తెలంగాణ లో సంచలనంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయంపై ఆర్య వైశ్య భవన్ లో క్లూస్ టీమ్ తో  తనిఖీలు చేయించారు పోలీసులు. 

 

 ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు మంచంపై విగతజీవిగా పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది సహజ మరణమా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. అయితే ప్రణయ్ హత్య తర్వాత చోటు  చోటుచేసుకున్న పరిణామాలు పెరిగిపోయిన ఒత్తిడి కారణంగానే మారుతి రావు ఆత్మహత్య  చేసుకుని ఉండవచ్చని  భావిస్తున్నారు. ఒక మారుతీరావ్ మృత దేహం వద్ద  ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.పోలీస్ లకి   లభించిన లేఖలో గిరిజ నన్ను క్షమించు... అమృతం అమ్మ దగ్గరికి వచ్చేసేయ్ అని రాసి ఉంది. కాగా మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మారుతీరావు మరణవార్త వినగానే భార్య గిరిజా గుండెలు పగిలేలా ఏడ్చింది. 

 


 అయితే ఈ సందర్భంగా గిరిజా మీడియా వాళ్ళ పై అసహనం వ్యక్తం చేసింది. మీడియా వాళ్లు ఇక చాలు వెళ్ళండి.. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయండి అంటూ మారుతీ రావు భార్య గిరిజ అసహనం వ్యక్తం చేసింది. పోస్టుమార్టం అనంతరం మిర్యాలగూడలోని మారుతి రావు నివాసంలో ఆయన మృతదేహం చుట్టూ... ఒక్కసారిగా మీడియా ప్రతినిధులు కెమెరామెన్ లు అందరూ గుమీ గూడటంతో... మారుతీ రావు భార్య గిరిజ మీడియా ప్రతినిధులు అందరికీ దండం పెట్టి ఇక చాలు వెళ్ళండి అంటూ వేడుకున్నారు. కొన్ని ఛానళ్లు వెబ్సైట్లు మారుతీరావు విలన్ గా చిత్రీకరించడం వల్లే ఆయన తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు అంటూ మారుతీ రావు భార్య గిరిజ అసహనం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: